Begin typing your search above and press return to search.

'స్కంద' స్పీకర్‌ లు బద్దలు అవ్వబోతున్నాయి!

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

By:  Tupaki Desk   |   25 Sep 2023 5:25 AM GMT
స్కంద స్పీకర్‌ లు బద్దలు అవ్వబోతున్నాయి!
X

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిన స్కంద సినిమా ఎదురుచూపులకు తెర దించుతూ భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అయింది. విడుదలకు ముందు ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమాలోని పాటలపై మొదటి నుండి కూడా యూనిట్ సభ్యులు హైప్ క్రియేట్‌ చేస్తూ వచ్చారు. కానీ స్కంద పాటలు ఒక మోస్తరుగానే ఉన్నాయి అన్నట్లుగా శ్రోతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ రేంజ్ మ్యూజిక్ ను థమన్ అందించడంలో మళ్లీ విఫలం అయ్యాడు అంటూ చాలా మంది పెదవి విరుస్తున్న ఈ సమయంలో రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో స్కంద సినిమా ప్రమోషన్‌ లో భాగంగా రామ్‌ మాట్లాడుతూ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాడు. కచ్చితంగా గతంలో అఖండ సినిమా థియేటర్ లో ఎలా అయితే స్పీకర్లు బద్దలు అయ్యాయో ఇప్పుడు కూడా అలాగే స్పీకర్‌ లు బద్దలు అవ్వబోతున్నాయి అన్నట్లుగా రామ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ గురించి చెప్పుకొచ్చాడు.

ఈ మధ్య కాలంలో థమన్‌ పాటలు ఇంకా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అంతంత మాత్రమే అన్నట్లుగా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్కంద సినిమా తో థమన్ ఆ విమర్శలకు సమాధానం చెప్తాడేమో చూడాలి. రామ్‌ వ్యాఖ్యలను చూస్తూ ఉంటే అఖండ ని మళ్లీ గుర్తు చేసే విధంగా థమన్ బీజీఎం ఉంటుందేమో చూడాలి.

స్కంద సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు మరియు వాటికి థమన్ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ మరో లెవల్ అన్నట్లుగా ఉంటుందని రామ్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చాడు. బోయపాటి మూవీ అంటే యాక్షన్‌ సన్నివేశాలకు పెట్టింది పేరు. అలాంటి సన్నివేశాలకు థమన్ ఇచ్చే స్కోర్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనుక స్కంద తో థమన్‌ మళ్లీ అఖండ ని గుర్తు చేస్తాడు అనడంలో సందేహం లేదు అనిపిస్తుంది.