Begin typing your search above and press return to search.

అఖండ రేంజ్​లోనే స్కంద.. సినిమాలో హైలైట్స్ ఇవే

దర్శకుడు బోయపాటికి ఓ మార్క్ ఉంటుంది. తన సినిమాల్లో కచ్చితంగా ఎమోషనల్ అండ్ యాక్షన్.. రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కిస్తుంటారు

By:  Tupaki Desk   |   22 Sep 2023 9:09 AM GMT
అఖండ రేంజ్​లోనే స్కంద.. సినిమాలో హైలైట్స్ ఇవే
X

దర్శకుడు బోయపాటికి ఓ మార్క్ ఉంటుంది. తన సినిమాల్లో కచ్చితంగా ఎమోషనల్ అండ్ యాక్షన్.. రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కిస్తుంటారు. పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాంబియన్స్, హీరో యాటిట్యూడ్, బలమైన రౌడీలు, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మొత్తంగా హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ తో.. మాస్ ఆడియెన్స్​కు కావాల్సినంత ఫుల్ మీల్స్ పెడతారు.

అయితే ఇప్పుడు ఆయన నుంచి అఖండ లాంటి భారీ బ్లక్ బాస్టర్ హిట్ తర్వాత రాబోతున్న చిత్రం స్కంద. ఈ చిత్రం మరో ఆరు రోజుల్లో గ్రాండ్​ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేనితో బోయపాటి ఈ చిత్రాన్ని చేశారు. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచ‌నాలే ఉన్నాయి. టైటిల్, టీజ‌ర్ అన్నీ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ట్రైలర్ కూడా రొటీన్ స్ట‌ైల్ లోనే ఉన్నా పవర్ ఫుల్ గానే సాగింది.

అలాగే ఈ సినిమాకు అఖండ చిత్రానికి కాస్త పోలీకలు కనిపిస్తున్నాయి. స్కంద ట్రైలర్​లో రామ్ పక్కా మాస్ అవతార్ సినీ ప్రియులు, అభిమానులకు బాగా ఆకట్టుకున్నాయి. ప్రచార చిత్రాలన్ని చూస్తే.. బోయపాటి మార్క్ పక్కా కనిపించింది. దీనికి రామ్ ర్యాంపేజ్ యాక్షన్ తోడవ్వడం వల్ల సినిమాలో రామ్ పాత్ర ఎంతటి మాస్ రేంజ్ లో ఉండబోతుందో అర్థమైపోయింది. మొత్తంగా బోయపాటి మార్క్ యాక్షన్... అఖండ సహా ఇతర చిత్రాలు ఎలా ఉంటాయో.. స్కంద కూడా అలానే ఫ్యామిలీ డ్రామా ఇతర కమర్షియల్ హంగులతో పక్కా హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా ఉండబోతుందని దాదాపుగా స్పష్టమవుతోంది.

ఇక ఈ స్కంద సినిమా ఫుల్ రన్ టైమ్ 167 నిమిషాలు. అంటే 2 గంటల 47 నిమిషాలు. అఖండది కూడా సేమ్ ఇదే రన్ టైమ్. 167 నిమిషాలే. ఇకపోతే అఖండలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించగా.. అందులో అఖండ పాత్ర.. ఎంతగా హైలైట్ అయిందో తెలిసిన విషయమే. ఈ పాత్రలో బాలయ్య గెటప్, యాక్షన్, డైలాగ్స్.. ప్రతీది సినిమాకే హైలైట్ గా నిలవడంతో పాటు సినిమా సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది.

ఇప్పుడు స్కందలో కూడా రామ్ పోతినేని సెకండ్ లుక్.. మాస్ అవతార్ రోల్ అలానే కనిపిస్తోంది. అతడు విలన్లపై ఊరమాస్ గా విరుచుకుపడుతూ భయపెట్టేది చూస్తుంటే... ఈ పాత్రే సినిమాకు హైలైట్ అవ్వడబోతుందని అర్థమవుతోంది. అచ్చం అఖండలానే ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగుతుందని తెలుస్తోంది. ఇకపోతే తమన్ మ్యూజిక్ అందించిన పాటలకు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. మొత్తంగా అఖండ తరహాలో.. స్కందలోనూ హై మూమెంట్స్, పవర్ ఫుల్ గా రామ్ సెకండ్ లుక్, ఎమోషన్స్, ఇతర ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్​, సాంగ్స్ అన్ని ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే బోయపాటి కూడా సినిమా ఔట్ ఫుట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.

ఇక శ్రీలీల ఎన్టర్జిటిక్ యాక్టింగ్, డ్యాన్స్ ప్రెజెన్స్, ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ కూడా చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. కాబట్టి సినిమా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రం అఖండ రేంజ్ లో భారీ సక్సెస్ ను అందుకుంటుందో లేదో..