Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా అన్నారు.. పాటలతో క్రేజ్ వస్తుందా?

ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ లోకి రీచ్ కావాలంటే కచ్చితంగా సాంగ్స్, టీజర్ ని అన్ని భాషల లో రిలీజ్ చేసి అంచనాలు పెంచాలి.

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:04 AM GMT
పాన్ ఇండియా అన్నారు.. పాటలతో క్రేజ్ వస్తుందా?
X

రామ్ పోతినేని హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా స్కంద తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా బోయపాటి సిద్ధం చేస్తున్నారు. మూవీ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకిదే మొదటి పాన్ ఇండియా మూవీ. ఇక రామ్ కూడా స్కంద చిత్రం పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి నుంచి రాబోతున్న మూవీ స్కంద. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేశారు. ఆగష్టు 3, 9:36 గంటలకి సాంగ్ లాంచ్ కాబోతోంది. సాంగ్ ప్రోమోని ఆగష్టు 1న 10:26 గంటలmకి రిలీజ్ చేయబోతున్నారు. రామ్ పోతినేని, శ్రీలీల మీద చిత్రీకరించిన డ్యూయెట్ ని ఫస్ట్ సింగిల్ గా లాంచ్ చేయబోతున్నారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన పాటని ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య మోస్ట్ సక్సెస్ ఫుల్ సింగర్ గా సిద్ శ్రీరామ్ దూసుకుపోతున్నారు. అతని పాటల కి అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ గా ప్రేక్షకులకి అందించడానికి రెడీ అయ్యారు. పాటకూడా కేవలం తెలుగు లోనే రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్నీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏకంగా ఐదు భాషల లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్కంద సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నా కూడా ఆ స్థాయి లో ప్రమోషన్ స్ట్రాటజీ మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ లోకి రీచ్ కావాలంటే కచ్చితంగా సాంగ్స్, టీజర్ ని అన్ని భాషల లో రిలీజ్ చేసి అంచనాలు పెంచాలి. ఆడియన్స్ కి సినిమా ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి.

అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపించడం లేదు. వారి ఫోకస్ అంతా తెలుగుమీదనే ఉంది. ఇలా అయితే పాన్ ఇండియా హీరోగా తన ని తాను ఎలివేట్ చేసుకోవాలని అనుకుంటున్నా రామ్ పోతినేని పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ మూవీ వరకు వెయిట్ చేయాల్సిందే అనే మాట వినిపిస్తోంది. మరి బోయపాటి మీద రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని అతనికి పాన్ ఇండియా మార్కెట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.