Begin typing your search above and press return to search.

స్కంద కల్ట్ మామ.. మసాలా పెంచే టైమొచ్చింది!

'కల్ట్ మామ' అనే ఆ పాటలో రామ్, ఊర్వశి డాన్స్ స్టెప్పులతో పాటు సాంగ్ కూడా యువతకు కిక్కిచ్చే విధంగా ఉంటుందట.

By:  Tupaki Desk   |   16 Sep 2023 12:14 PM GMT
స్కంద కల్ట్ మామ.. మసాలా పెంచే టైమొచ్చింది!
X

రామ్ పోతినేని బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న హై వోల్టేజ్ మాస్ మసాలా యాక్షన్ మూవీ స్కందపై ఓ వర్గం ఫాన్స్ లో మొన్నటి వరకు అంచనాలు గట్టిగానే పెరిగాయి అయితే సినిమా విడుదల డేట్ లో మార్పులు రావడంతో మళ్లీ కాస్త బజ్ అయితే తగ్గిపోయింది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే సలార్ సినిమా వాయిదా పడడంతో మళ్ళీ ఆ డేట్ ను క్యాష్ చేసుకోవాలి అని 28 కి షిఫ్ట్ చేశారు. అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ చాలా నెమ్మదిగా వెళుతుంది అనే విధంగా కామెంట్స్ అయితే వినిపించాయి. బోయపాటి పై మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలే ఉంటాయి. అంతేకాకుండా అఖండ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో మార్కెట్లో కూడా ఈ సినిమాకు డిమాండ్ అయితే పెరిగింది.

ఇక రామ్ పోతినేని మాస్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటిస్తాడు అని ఇదివరకే రుజువు చేశాడు. ఇక బోయపాటి దర్శకత్వంలో అతను సినిమా చేస్తున్నాడు అంటే ఆ ఒక్క పాయింట్ తోనే సినిమాకు కావాల్సినంత బజ్ పెరగాలి. కానీ మొన్నటి వరకు ఆ హడావిడి కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒకే ఒక పాటతో మళ్ళీ మసాలా యాడ్ చేసే విధంగా సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో ఊర్వశి రౌతెల ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే. 'కల్ట్ మామ' అనే ఆ పాటలో రామ్, ఊర్వశి డాన్స్ స్టెప్పులతో పాటు సాంగ్ కూడా యువతకు కిక్కిచ్చే విధంగా ఉంటుందట. లేటెస్ట్ గా విడుదల చేసిన ఒక పోస్టర్ చూస్తేనే సాంగ్లో మసాలా స్టెప్పులు గట్టిగానే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఊర్వశి గ్లామర్ రామ్ పోతినేని స్టైలిష్ డాన్స్ స్టెప్పులతో పాటు మాస్ స్టెప్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు.

కల్ట్ మామ అనే ఈ పాటను సెప్టెంబర్ 18వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ పాట పైనే కాస్త ఎక్కువ అంచనాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా థమన్ ఈసారి సినిమా రేంజ్ పెంచే విధంగానే ఆకట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి పాట ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.