Begin typing your search above and press return to search.

స్కంద సెన్సార్ రిపోర్ట్..అఖండ అంత నిడివి?

ఈ సినిమా నిడివి వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ చిత్రం 167 నిమిషాలు (2 గంటల 47 నిమిషాలు) నిడివితో ఉంటుంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 4:13 AM GMT
స్కంద సెన్సార్ రిపోర్ట్..అఖండ అంత నిడివి?
X

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (రాపో) క‌థానాయ‌కుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా స్కంద‌. శ్రీలీల కథానాయిక. ట్రైలర్ సినిమాకు కావాల్సిన జోరును అందించింది. స్కంద సెప్టెంబర్ 28కి వాయిదా పడిన సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం మేర‌కు విడుదలకు మూడు వారాల ముందే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యుఎ సర్టిఫికేట్ ఇచ్చింది.

ఈ సినిమా నిడివి వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ చిత్రం 167 నిమిషాలు (2 గంటల 47 నిమిషాలు) నిడివితో ఉంటుంది. బోయపాటి గత చిత్రం అఖండ కూడా ఇదే రన్‌టైమ్‌ను కలిగి ఉంది. నిజానికి బోయ‌పాటి మార్క్ మాస్ అంసాలు ఆడియెన్ కి క‌నెక్ట‌యితే ఈ నిడివి పెద్ద సమస్య కానేకాదు.

ఇది రామ్ లోని మాసిజాన్ని మ‌రో స్థాయికి చేర్చే సినిమాగా ఇప్ప‌టికే ట్రైల‌ర్ వీక్షించిన వారికి అర్థ‌మైంది. ఇస్మార్ట్ శంక‌ర్ లో రామ్ మాసిజం ఆడియెన్ కి బాగా క‌నెక్ట‌యింది. ఇప్పుడు బోయ‌పాటిలోని మాస్ ని క‌లుపుకుని రామ్ మ‌రింత‌గా ఎక్కిస్తాడ‌నే భావిస్తున్నారు. స్కందలో సాయి మంజ్రేకర్ ఒక ముఖ్యమైన పాత్రలో న‌టించింది. ద‌బాంగ్ 3, మేజ‌ర్ త‌ర్వాత స‌యీ ముఖ‌ర్జీకి ఇది కీల‌క‌మైన సినిమా.

స‌లార్ సైడిచ్చాక ..! నిజానికి సెప్టెంబర్28న ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం 'స‌లార్' విడుద‌ల కావాల్సి ఉండ‌గా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ బిగ్ బ‌డ్జెట్ మూవీ సైడ్ ఇవ్వగానే ఇటు తెలుగు సినిమాలు, అటు త‌మిళ సినిమాలు వ‌రుస‌గా రిలీజ్ కి క్యూ క‌ట్టాయి. వాటి రిలీజ్ తేదీల‌ను స‌ర్ధుబాటు చేసారు. ఇదే కేట‌గిరీలో రామ్ న‌టించిన స్కందకు కూడా ఇదే తేదీన (28సెప్టెంబ‌ర్) అవ‌కాశం దొరికింది.

చిత్ర‌యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌చారంలో వేగం పెంచింది. స్కంద‌తో మాస్ లో మ్యాసివ్ హిట్ కొట్టాల‌ని రామ్ క‌ల‌లుకంటున్నాడు. త‌దుప‌రి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో డ‌బుల్ ఇస్మార్ట్ లోను రామ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బోయ‌పాటి రామ్ లాంటి ఎన‌ర్జిటిక్ హీరోతో డ‌బుల్ ధ‌మాకా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ని అందించాల‌ని త‌పించారు. స్కంద పూర్తిగా బోయ‌పాటి మార్క్ సినిమా అనే విష‌యం ట్రైల‌ర్ చూడ‌గానే అర్థ‌మైంది.

రామ్ కెరీర్ బిగ్ బ‌డ్జెట్ మూవీ మాస్ ఎంటర్‌టైనర్ స్కంద ఈద్-ఈ-మిలాద్, వినాయ‌క చ‌వితి సెల‌వుల‌ను ఎన్ క్యాష్ చేస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. స్కందకు సుదీర్ఘ వీకెండ్ ప్ల‌స్ కానుంది. గురువారం క‌లుపుకుని నాలుగురోజుల వీకెండ్ ని ఎన్ క్యాష్ చేస్తుంద‌ని భావిస్తున్నారు. గాంధీ జయంతి అయిన సోమవారం (5వ రోజు) నాడు జాతీయ సెలవుదినం కావ‌డంతో స్కంద ఆ మేర‌కు ప్రయోజనం పొందుతుంది. స్కంద బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే, దీర్ఘకాలంలో దసరా సెలవులను కూడా క్యాష్ చేస్తుందని భావిస్తున్నారు. రామ్ కెరీర్ లోనే స్కంద అత్యంత ఖరీదైన చిత్రం. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లోను దూకుడు క‌నిపించింది.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్ - పవన్ కుమార్ సమర్ప‌ణ‌లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ తదితరులు నటించిన స్కంద బెస్ట్ పెర్ఫామ‌ర్స్ మూవీగా నిలుస్తుంద‌ని భావిస్తున్నారు.