Begin typing your search above and press return to search.

మాటిస్తున్నా.. మహేశ్​ బాబుతో సినిమా చేస్తా

ఎస్​జే సూర్య మాట్లాడుతూ.. "నాని అనే సినిమా చేశాను అది పెద్దగా ఆడలేదు. కానీ మహేశ్ బాబు మంచి పెర్​ఫార్మెన్స్​ చేశారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 12:27 PM GMT
మాటిస్తున్నా.. మహేశ్​ బాబుతో సినిమా చేస్తా
X

ఎస్.జె. సూర్య.. చాలా మంది సినీ ప్రియులకు బాగా తెలిసిన పేరు. ముఖ్యంగా మహేశ్ బాబు స్పైడర్​ సైకో విలన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. నటుడిగానూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, విలన్​గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే తాజాగా ఆయన సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు గురించి మరోసారి మాట్లాడారు. ఎప్పటికైనా మహేశ్​తో ఓ సినిమా తీసి సూపర్ హిట్ కొడతానని అభిమానులకు మాటిచ్చారు.

వివరాళ్లోకి వెళితే.. ఎస్​జేసూర్య.. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్​తో 'ఖుషి' సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్​లో అది బిగ్గెస్ట్ క్లాసిక్​ హిట్​గా నిలిచిపోయింది. అలాగే ఆయన.. మహేశ్​ బాబూతో 'నాని' అనే సినిమా చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మహేశ్​ నటించిన స్పైడర్ సినిమాలో సైకో విలన్​గా నటించి భయపెట్టారు. కానీ ఈ రెండు చిత్రాలు అట్టర్​ ఫ్లాప్ అయ్యాయి.

అయితే ఎస్​ జేసూర్య.. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో జిగర్తాండ డబుల్ ఎక్స్ ఒకటి. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. ఈ టీజర్​ను తెలుగులో మహేశ్​బాబు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఈవెంట్​లో పాల్గొన్న ఎస్​జే సూర్య మాట్లాడుతూ.. "నాని అనే సినిమా చేశాను అది పెద్దగా ఆడలేదు. కానీ మహేశ్ బాబు మంచి పెర్​ఫార్మెన్స్​ చేశారు.

మహేశ్​తో కలిసి ఓ సినిమాలో నటించారు. అయితే మహేశ్​తో ఎప్పటికైనా ఓ హిట్​ సినిమా తీసి బ్యాలెన్స్​ చేయాలి. తమిళంలో అజిత్​, విజయ్​, తెలుగులో పవన్​కు ఓ సూపర్ హిట్ ఇచ్చాను. కానీ మహేశ్​తో సూపర్ హిట్​ ఇవ్వలేదు. ఎప్పటికైనా ఇస్తాను. మాట ఇస్తున్నాను" అని పేర్కొన్నారు.

గతంలోనూ ఓ సారి ఎస్​జే సూర్య.. నాని సినిమా పరాజయంపై మాట్లాడారు. ఆ సినిమా సమయంలో మహేశ్‌ అన్న ఓ మాట తననెంతో బాధపెట్టిందని కూడా అప్పుడు గుర్తుచేసుకున్నారు. "నాని సినిమా విషయంలో నాకింకా ఇప్పటికీ బాధగానే ఉంది. నాని అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా రిలీజయ్యాక ఓసారి మహేశ్‌.. 'మీరు ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టపడి చేశారో నాకు తెలుసు. రిజల్ట్​ పక్కనపెడితే మిమ్మల్ని, మీ వర్క్‌ను నేను అభిమానిస్తున్నా' అని అన్నారు. ఆయన మాట బాధను కలిగించింది. పవన్‌ కల్యాణ్‌కు హిట్‌ ఇచ్చాను. మహేశ్‌కు ఇవ్వలేకపోయాననే బాధ అలానే ఉండిపోయింది. మళ్లీ దర్శకుడిగా తప్పకుండా మహేశ్‌తో సినిమా చేసి.. తప్పకుండా హిట్‌ కొడతాను అని అన్నారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది రిలీజ్ కానుంది. ఆ తర్వాత రాజమౌళితో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేయనున్నారు. ఇది పూర్తయ్యే సరికి దాదాపు ఐదేళ్లైనా పడుతుందని అంతా అంటున్నారు. మరి ఎస్​ జే సూర్య.. మహేశ్​ బాబుతో ఎప్పుడు సినిమా చేస్తారో మరి...