Begin typing your search above and press return to search.

ఎస్​ జే సూర్య యాక్షన్ లో నానీ

ఈ క్రమంలోనే చిత్రంలో టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   24 Oct 2023 12:00 PM GMT
ఎస్​ జే సూర్య యాక్షన్ లో నానీ
X

ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో ఇతర భాషల నటులు ఎక్కువైపోతున్నారు. అందులోను స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా చాలా మంది నటులుగా మారి మంచి పాత్రలను దక్కించుకుంటున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సినిమాలో కూడా తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ జే సూర్య భాగస్వామ్యం అయినట్లు అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చింది. విశేషం ఏంటంటే.. ఆయనే ఈ చిత్ర తొలి షాట్​ను డైరెక్ట్​ చేశారు.

వివరాళ్లోకి వెళితే.. ఈ మధ్య ఎక్కువగా ప్రయోగాలకు ప్రాముఖ్యత ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు నాని. కొత్త దర్శకులతో వరుసగా పనిచేస్తున్నారు. ఈ మధ్యే దసరా చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాని.. తన 30వ సినిమాను డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ డైరెక్షన్​లో చేశారు. హాయ్‌ నాన్న టైటిల్​తో ఫాదర్ అండ్ డాటర్​ సెంటిమెంట్​తో డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే నాని కొత్త సినిమా సరిపోద శనివారం అప్డేట్​ కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై నిర్మిస్తూ.. బ్యాక్​ టు బ్యాక్ అప్డేట్స్​ కూడా​ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రంలో టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే.. ఎస్‌జే సూర్యను టీంలోకి ఘనంగా స్వాగతం పలుకుతూ.. నాని అండ్‌ మేకర్ష్‌ టీమ్​ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ను అందరితో షేర్ చేసుకున్నారు‌.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విశేషం ఏమిటంటే.. షూటింగ్ మూహూర్తం షాట్​ను ఎస్​ జే సూర్యనే డైరెక్ట్ చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను మూవీటీమ్​ షేర్ చేసింది. అయితే ఎస్​ జే సూర్ పోషించేది విలన్​ రోలా కాదా అన్నది క్లారిటీ లేదు. నాని పక్కన ప్రియాంక మోహన్ హీరోయిన్​గా నటించనుంది.

కాగా, ఈ మధ్య కాలంలో ఎస్ జే సూర్య నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు నాని సినిమాకు ఎస్ జే సూర్య నటిస్తుండడం తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమా మార్కెట్​కు చాలా హెల్ప్ అవుతుందనే చెప్పాలి.