Begin typing your search above and press return to search.

పార్ట్ టైం డైరెక్టర్.. ఫుల్ టైం యాక్టర్.. భలే బిజీ అయ్యాడుగా..!

ఈ రెండు సినిమాలతో కచ్చితంగా తెలుగులో కూడా ఎస్.జె సూర్య బిజీ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   6 April 2024 4:30 PM GMT
పార్ట్ టైం డైరెక్టర్.. ఫుల్ టైం యాక్టర్.. భలే బిజీ అయ్యాడుగా..!
X

తెలుగులో దర్శకులు నటించాలంటే అది కుదరని పని ఒకరిద్దరు ఏదో తమ కోరిక కోసం సినిమాల్లో నటిస్తారు తప్ప ఇక్కడ డైరెక్టర్, యాక్టర్ రెండు సెపరేట్ గా ఉంటాయి. ఒకటి చేస్తే మరోటి పూర్తిగా పోతుందని మన వాళ్లు ఫిక్స్ అయ్యారు. అలా డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి యాక్టర్ గా కెరీర్ ఫిక్స్ చేసుకున్న వారు తక్కువే. కానీ కోలీవుడ్ లో మాత్రం అలాంటి వారు ఎక్కువ అవుతున్నారు. వారిలో ఖుషి డైరెక్టర్ ఎస్.జె సూర్య అయితే ఫస్ట్ లైన్ లో ఉన్నారు.

ఎస్.జె సూర్య తెలుగు ఆడియన్స్ కు డైరెక్టర్ గా పరిచయం కానీ కోలీవుడ్ లో ఆయన డైరెక్టర్ అన్న విషయం మర్చిపోయి మంచి నటుడు, బిజీ విలన్ ఇలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడు. నటుడిగా మారిన ఎస్.జె సూర్య వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. మొన్నటిదాకా తమిళ సినిమాలు చేసిన సూర్య ఇప్పుడు తెలుగులో కూడా నటుడిగా అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటిస్తున్న ఎస్.జె సూర్య శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ లో కూడా నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలతో కచ్చితంగా తెలుగులో కూడా ఎస్.జె సూర్య బిజీ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మలయాళంలో కూడా ఎస్.జె సూర్య ఛాన్స్ అందుకున్నారని తెలుస్తుంది. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న నెక్స్ట్ సినిమాలో సూర్య స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుంది. అక్కడ స్టార్ డైరెక్టర్ విపిన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఎస్.జె సూర్య అవకాశం దక్కించుకున్నారు.

మొన్నటిదాకా కోలీవుడ్ లో ఇప్పుడు తెలుగు సినిమాలతో అలరించబోతున్న సూర్య ఇక మీదట మలయాళ సినిమాలతో కూడా రాణించాలని చూస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటుగా మలయాళంలో కూడా ఎంట్రీ ఇస్తున్న ఎస్.జె సూర్య అక్కడ ప్రేక్షకులను తన నటనతో మెప్పించాలని చూస్తున్నారు. బెస్ట్ స్టోరీ టెల్లర్స్ గా చెప్పుకునే మలయాళ దర్శకులు నటుడిని ఎలా వాడుకోవాలన్నది కూడా బాగా తెలుసు. కాబట్టి ఫాహద్ ఫాజిల్ సినిమాతో ఎస్.జె సూర్య మరో లక్కీ ఛాన్స్ అందుకున్నారని చెప్పొచ్చు.