ఆ క్యారెక్టర్లకు ఇకపై స్టార్ డైరెక్టర్ గుడ్ బై
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన `ఖుషీ` తెలుగులో ఏ స్థాయి సంచనలం సృష్టించిందో అందరికి తెలిసిందే.
By: Tupaki Desk | 18 April 2025 11:23 AM ISTపవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన `ఖుషీ` తెలుగులో ఏ స్థాయి సంచనలం సృష్టించిందో అందరికి తెలిసిందే. పవన్‌కు స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టిన ఈ మూవీని తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య తెరకెక్కించారు. తమిళంలో విజయ్‌తో, తెలుగులో పవన్‌కల్యాణ్‌తో తెరకెక్కించి రెండు భాషల్లోనూ సంచలనం సృష్టించారు. దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఎస్.జె.సూర్య `న్యూ` సినిమాతో హీరోగా కూడా మారి సంచలనం సృష్టించారు.
హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూనే దర్శకుడిగానూ సక్సెస్‌లను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల డైరెక్షన్‌కు బ్రేక్ ఇచ్చి నటుడిగా కొనసాగుతూ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. మహేష్‌బాబు నటించిన `స్పైడర్ మూవీతో విలన్ క్యారెక్టర్లకు తెరలేపిన ఎస్.జె. సూర్య సైకో పాథ్ క్యారెక్టర్లకు, రూత్‌లెస్ కాప్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆయన చేసిన క్యారెక్టర్ల కారణంగా చాలా వరకు సినిమాలు ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసి సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి.
అయితే ఇకపై ఎస్.జె. సూర్య విలన్ క్యారెక్టర్స్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారట. ఇండియన్ 3, లవ్ ఇన్యూరెన్స్ కంపనీ, సర్దార్ 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లలో విలన్‌గా నటిస్తున్న ఎస్.జె.సూర్య ఇకపై విలన్ క్యారెక్టర్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే టాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ ఆఫర్లని సూర్య రిజెక్ట్ చేసినరట్టుగా ఇన్ సైడ్ టాక్. త్వరలోనే మళ్లీ మెగా ఫోన్ పట్టి మరోసారి డైరెక్టర్‌గా బిజీ కావాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఎస్.జె. సూర్య `కిల్లర్` మూవీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సూర్య విలన్‌గా స్పైడర్, మెర్సల్, మానాడు, రాయన్, మార్క్ ఆంటోనీ, గేమ్ ఛేంజర్, సరిపోదా శనివారం చిత్రాల్లో నటించారు. వీటిలో స్పైడర్, రాయన్, సరిపోదా శనివారం సినిమాల్లో ఎస్.జె. సూర్య క్యాక్టర్ హైలైట్‌గా నిలవడం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఎస్.జె. సూర్య క్యారెక్టర్ కారణంగానే ఈ సినిమాలు హైలైట్ అయ్యాయి. అలా తనదైన మార్కు విలనీతో అదరగొట్టిన ఎస్.జె. సూర్య ఉన్నట్టుండి ఇలా విలన్ క్యారెక్టర్లకు గుడ్‌బై చెప్పడం ఏమీ బాగాలేదని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు.
