డైరెక్టర్‌గా ఎస్.జే సూర్య.. ఈసారి 'కిల్లర్'!
దిగ్గజ నటుడు, డైరెక్టర్, రచయితగా గుర్తింపు పొందిన ఎస్.జే సూర్యా.. దశాబ్దం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టాడు.
By: Tupaki Desk | 27 Jun 2025 10:49 AM ISTదిగ్గజ నటుడు, డైరెక్టర్, రచయితగా గుర్తింపు పొందిన ఎస్.జే సూర్యా.. దశాబ్దం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టాడు. గతంలో ‘వాలీ’, ‘ఖుషి’, ‘న్యూ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన సూర్యా, ఇప్పుడు తన కలల ప్రాజెక్ట్ ‘కిల్లర్’తో డైరెక్షన్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తోపాటు నటనలోనూ తనదైన ముద్ర వేయబోతున్నాడు.
ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ మరియు సూర్యా స్వంత సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోకులం గోపాలన్ నిర్మాణ బాధ్యతలు చేపడుతుండగా, వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ కో ప్రొడ్యూసర్లు, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సౌత్ సినిమా రంగంలో శ్రీ గొకులం మూవీస్ ఇప్పటికే మలయాళం భాషలో కొన్ని పెద్ద చిత్రాలతో బిజీగా ఉంది.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా, 'కిల్లర్' సినిమా ఐదు భాషల్లో విడుదల కానుందని, ఇది పాన్ ఇండియా సినిమాగా అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ స్పష్టం చేసింది. సూర్యా ఈ ప్రాజెక్ట్‌ను ఓ సినిమాటిక్ స్పెక్టకిల్‌గా రూపొందించాలని ఎంతో కష్టపడుతున్నాడు. కథనాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకి అత్యుత్తమ కాస్టింగ్ ఉండబోతోందట. ఇండియన్ సినిమాకు చెందిన టాప్ టాలెంట్స్ ఇందులో భాగం కానున్నారు. నటీనటులు మాత్రమే కాదు.. టెక్నికల్ టీమ్ కూడా అలానే బలంగా ఉండబోతున్నదట. ఇంకా నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించబోతున్నారు. అంతేకాదు.. ఈ సినిమాకి సరికొత్త కాన్సెప్ట్ ఉండబోతుందని సమాచారం.
ఇక శ్రీ గొకులం మూవీస్ ప్రస్తుతం మలయాళంలో ‘ఒట్టకొంబన్’ (సురేశ్ గోపీ), ‘కథనార్’ (జయసూర్య), ‘భా భా బా’ (దిలీప్) వంటి సినిమాలను నిర్మిస్తోంది. ఒక్క తెలుగు కాకుండా, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా కిల్లర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో, ఇది ఎస్.జే సూర్యా కెరీర్‌లో ఓ బిగ్ మూవీగా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘కిల్లర్’ సినిమాతో ఆయన మళ్లీ ఓ కొత్త ట్రెండ్ సెట్ అవకాశాలున్నాయి.
