SJ సూర్య అందుకే పెళ్లి చేసుకోలేదా?
అలా ఫుల్ బిజీగా ఉన్న ఆయన.. నేడు తన 57వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 21 July 2025 10:42 AM ISTమల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ ఎస్ జే సూర్య గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పలు సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన ఆయన.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత దర్శకుడిగా కూడా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు నిర్మాత కూడా వ్యవహరిస్తున్నారు ఎస్ జే సూర్య.
అలా ఫుల్ బిజీగా ఉన్న ఆయన.. నేడు తన 57వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన ఐకానిక్ మూవీస్ లోని సీన్స్ ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. సూర్యకు క్రేజీగా బర్త్ డే విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు ఎస్ జే సూర్య. వివాహం కోసం అస్సలు ఆలోచించలేదు కూడానట. దానికి కారణం ఆయన లక్ష్యమే. ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తాను పెళ్లి మ్యాటర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన లక్ష్యం కోసం ఇంకా ఇప్పటికీ పరిగెడుతూనే ఉన్నానని ఆయన తెలిపారు.
అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదని చెప్పారు. సినిమాల విషయంలో ఇంకా తన టార్గెట్ ను చేరుకోలేదని వెల్లడించారు. అలా ఇప్పటికీ వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. అయితే కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తర్వాత సీనియర్ నటుడు ఎవరంటే సూర్యనే అని చెప్పాలి.
కాగా.. హీరో కావాలనే టార్గెట్ తో తొలుత భాగ్యరాజ్, భారతీరాజా, వసంత వంటి దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు సూర్య. ఆ తర్వాత చిన్న పాత్రల్లో నటించే ఛాన్స్ అందుకున్నారు. అప్పుడే ప్రత్యేకమైన రోల్స్ లో కూడా యాక్ట్ చేశారు. న్యూ అనే మూవీతో హీరోగా మారారు. వాలి చిత్రంతో దర్శకుడిగా డెబ్యూ ఇచ్చారు.
తెలుగులో పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రానికి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో దర్శకుడిగా పలు చిత్రాలు చేశారు. కానీ ఆ తర్వాత నటనపైనే ఫోకస్ పెట్టారు. ఇరైవి, స్పైడర్, మెర్సల్ వంటి వివిధ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు. ఇప్పుడు హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో యాక్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. దర్శకుడిగా కిల్లర్ మూవీ చేస్తున్నారు.
