నానికి క్షమాపణలు చెప్పిన ఎస్‌జె సూర్య!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా అనౌన్స్ చేసిన గద్దర్ సినీ అవార్డుల్లో సరిపోదా శనివారం సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ రోల్ చేసినందుకు గానూ ఎస్‌జె సూర్యకు అవార్డు గెలుచుకున్నారు
By: Tupaki Desk | 31 May 2025 11:44 AMతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా అనౌన్స్ చేసిన గద్దర్ సినీ అవార్డుల్లో సరిపోదా శనివారం సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ రోల్ చేసినందుకు గానూ ఎస్‌జె సూర్యకు అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నాని ఎస్‌జె సూర్యను అభినందిస్తూ ట్వీట్ చేయగా, దానికి ఎస్‌జె సూర్య కూడా రిప్లై ఇచ్చారు. అయితే నాని ట్వీట్ కు సరైన రిప్లై ఇవ్వకపోవడంపై అసంతృప్తి చెందిన ఎస్‌జె సూర్య శనివారం రోజు నానికి క్షమాపణలు చెప్తూ మరో ట్వీట్ వేశారు.
డియర్ నేచురల్ స్టార్ నాని సర్. షూటింగ్ మధ్యలో నేను ట్వీట్ చేసినందుకు క్షమించండి, నేను మీకు సరిగా రిప్లై ఇవ్వలేకపోయాను. మీ ట్వీట్ కు థ్యాంక్స్ సర్ అని మాత్రమే చెప్పడం కచ్ఛితంగా సరిపోదు. మీరు, డైరెక్టర్ వివేక్ సర్ సినిమా షూటింగ్ నుంచి ఇప్పుడు ఈ ట్వీట్ వరకు ఇచ్చిన సపోర్ట్ ఎంతో కీలకమైందని, మీ సపోర్ట్ లేకపోతే ఆ అవుట్‌పుట్ సాధ్యమయ్యేది కాదు, మీరు స్క్రీన్ పై మాత్రమే కాదు, బయట కూడా హీరోనే. థ్యాంక్యూ. మీ మాటలకు చాలా థ్యాంక్స్ సర్ అని ఎస్‌జె సూర్య తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.
దాని కంటే ముందే నాని సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించిన ఎస్‌జె సూర్యను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. కంగ్రాట్యులేషన్స్ సర్. మీరు సరిపోదా సినిమాలో విలన్, సపోర్టింగ్ యాక్టర్ మాత్రమే కాదు. సరిపోదా శనివారం అంటే మొత్తం మీరే. ఈ అవార్డుకు మీరు అన్ని విధాలా అర్హులు అని నాని పోస్ట్ చేయగా దానికి ఎస్‌జె సూర్య హడావిడిగా రెస్పాండ్ అయి, చాలా థ్యాంక్స్ నేచురల్ స్టార్ నాని సర్ అని ట్వీట్ చేశాడు.
నాని, ఎస్‌జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సరిపోదా శనివారం ఆగస్ట్ 29, 2024న రిలీజై భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక, గతేడాది భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో కూడా ఒకటిగా నిలిచింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దయా అనే అవినీతిపరుడైన పోలీసాఫీసర్ పాత్రలో ఎస్‌జె సూర్య అద్భుత ప్రదర్శనను కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు.