Begin typing your search above and press return to search.

వీడియో : ఆ హీరోతో కుర్చీ మడత పెట్టిన శ్రీలీల

తాజాగా చెన్నైలోని తిరుచిరాపల్లిలో జరిగిన ఈవెంట్‌ లో హీరో శివ కార్తికేయన్ మరియు హీరోయిన్‌ శ్రీలీల కలిసి పాల్గొన్నారు

By:  Tupaki Desk   |   24 March 2024 5:33 AM GMT
వీడియో : ఆ హీరోతో కుర్చీ మడత పెట్టిన శ్రీలీల
X

2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు, శ్రీలీల కాంబో మూవీ గుంటూరు కారం కమర్షియల్‌ గా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా ఆ సినిమాలోని కుర్చి మడత పెట్టి సాంగ్ మాత్రం ఇంకా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.

బాలీవుడ్‌ స్టార్స్ కూడా కొందరు ఇప్పటికే కుర్చీ మడత పెట్టి సిగ్నేచర్ స్టెప్స్ వేసి వైరల్‌ అయ్యారు. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో శివ కార్తికేయన్ కూడా కుర్చి మడత పెట్టి స్టెప్ వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. శివ కార్తికేయన్ తో శ్రీలీల ఈ స్టెప్స్ ను వేయించింది.

తాజాగా చెన్నైలోని తిరుచిరాపల్లిలో జరిగిన ఈవెంట్‌ లో హీరో శివ కార్తికేయన్ మరియు హీరోయిన్‌ శ్రీలీల కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో శ్రీలీల మరియు శివ కార్తికేయన్‌ గుంటూరు కారంలోని హిట్‌ సాంగ్ కుర్చీ మడత పెట్టి యొక్క సిగ్నేచర్ స్టెప్ ను వేసి ప్రేక్షకులకు కన్నుల విందు చేశారు.

ప్రస్తుతం వీరిద్దరు వేసిన కుర్చీ మడత పెట్టి డాన్స్ స్టెప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ ఉన్నారు. తమిళ హీరో తెలుగు హీరో పాటకు డాన్స్ చేయడం చాలా అరుదైన విషయం గా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.