స్టార్స్ కి షాక్ ఇచ్చేలా ఆ హీరో రెమ్యునరేషన్..?
లాస్ట్ ఇయర్ అమరన్ తో 300 కోట్లు కలెక్ట్ చేసి స్టార్ లీగ్ లో తాను ఉన్నానని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం మదరాసి, పరాశక్తి రెండు సినిమాలతో వస్తున్నాడు శివ కార్తికేయన్
By: Tupaki Desk | 8 April 2025 1:30 AMకోలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు శివ కార్తికేయన్. ముందు సైడ్ హీరోగా మొదలు పెట్టిన అతని కెరీర్ ఆ తర్వాత లీడ్ రోల్స్ చేస్తూ అలా స్టార్ గా ఎదిగాడు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తన మార్క్ చాటుకుంటున్నాడు శివ కార్తికేయన్. లాస్ట్ ఇయర్ అమరన్ తో 300 కోట్లు కలెక్ట్ చేసి స్టార్ లీగ్ లో తాను ఉన్నానని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం మదరాసి, పరాశక్తి రెండు సినిమాలతో వస్తున్నాడు శివ కార్తికేయన్.
మదరాసి సినిమా మురుగదాస్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా విషయంలో శివ కార్తికేయన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మురుగదాస్ ఇప్పుడు ఏమాత్రం ఫాం లో లేడు. అదీగాక రీసెంట్ గానే అతని ఖాతాలో సికందర్ లాంటి డిజాస్టర్ పడింది. అయితే సికందర్ ఎఫెక్ట్ శివ కార్తికేయన్ సినిమా మీద పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు. మదరాసి సినిమా ఫస్ట్ గ్లింప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి.
ఇదిలాఉంటే శివ కార్తికేయన్ సుధ కొంగర డైరెక్షన్ లో చేస్తున్న పరాశక్తి సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా పీరియాడికల్ స్టూడెంట్ డ్రామాగా వస్తుంది. హిట్లు సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న శివ కార్తికేయన్ అందుకు తగినట్టుగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
అంతకుముందు సినిమాకు 10 కోట్ల లోపే రెమ్యునరేషన్ గా తీసుకునే శివ కార్తికేయన్ హిట్లు కొడుతుండటం వల్ల డిమాండ్ పెరిగింది. దానికి తగినట్టుగానే పారితోషికం కూడా పెంచేశాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ ఒక సినిమాకు 35 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని కోలీవుడ్ టాక్. ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
శివ కార్తికేయన్ మదరాసి ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతుంది. ఇక పరాశక్తి సినిమా మాత్రం 2026 సంక్రాంతికి వస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాలతో శివ కార్తికేయన్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. శివ కార్తికేయన్ తో సినిమా కోసం తమిళ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే కథల విషయంలో మాత్రం శివ కార్తికేయన్ చాలా ఫోకస్ గా ఉంటున్నాడని తెలుస్తుంది.