Begin typing your search above and press return to search.

సెట్స్ మీదే సూపర్ హిట్ వైబ్..!

ఈ సినిమా పీరియాడికల్ యూత్ మూవీగా రాబోతుంది. సినిమాలో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   31 May 2025 1:30 AM
సెట్స్ మీదే సూపర్ హిట్ వైబ్..!
X

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ తన సినిమాలను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ అమరన్ తో సూపర్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ ప్రస్తుతం మురుగదాస్ తో మదరాసి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. దాంతో పాటే సుధ కొంగర డైరెక్షన్ లో పరాశక్తి సినిమా కూడా చేస్తున్నాడు. డాన్ పిక్చర్స్ బ్యానర్ లో ఆకాష్ భాస్కరన్ పరాశక్తి సినిమా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పీరియాడికల్ యూత్ మూవీగా రాబోతుంది. సినిమాలో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు. పరాశక్తి సినిమాకు మరో హైలెట్ హీరో రవి మోహన్ ఇందులో ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అథర్వ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. పరాశక్తి టైటిల్ అనౌన్స్ మెంట్ రోజే ఒక సర్ ప్రైజింగ్ టీజర్ తో ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు మేకర్స్.

ఐతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఐతే ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే హిట్ వైబ్ వినిపిస్తుందని అంటున్నారు. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం స్టూడెంట్ లీడర్ బ్యాక్ డ్రాప్ లో ఈమధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు రాలేదు. రాబోతున్న పరాశక్తి కచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. అదీగాక శివ కార్తికేయన్ స్టోరీ సెలక్షన్ మీద ఉన్న నమ్మకంతో కచ్చితంగా పరాశక్తి ఏదో మ్యాజిక్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు.

సుధ కొంగర డైరెక్షన్ టాలెంట్ అందరికీ తెలిసిందే. ఆమె ఎంచుకున్న కథను చాలా కన్విక్షన్ తో తెరకెక్కిస్తారు. అనవసరమైన హంగులు ఆర్భాటాలు ఉండవు. పరాశక్తి లాంటి పవర్ఫుల్ టైటిల్ తో రాబోతున్న ఈ యూనిట్ అదే రేంజ్ అవుట్ పుట్ తో వస్తారని అంటున్నారు. అమరన్ తో తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ ఈ సినిమాతో కూడా మరో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విషయంలో మేకర్స్ పెట్టుకున్న అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయన్నది చూడాలి. శివ కార్తికేయన్ సినిమా వస్తుంది అంటే అటు తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా అలర్ట్ అవుతున్నారు. పరాశక్తి తెలుగు తమిళ భాషల్లోనే కాదు పాన్ ఇండియా లెవెలో రిలీజ్ కాబోతుంది.