నిజాయితీ వల్లే ఆ హీరోని ఎంపిక చేశా
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ కార్తికేయన్ ను సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాన్ని సుధా కొంగర రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
By: Tupaki Desk | 19 July 2025 10:36 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అమరన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అమరన్ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత శివ కార్తికేయన్ క్రేజ్, మార్కెట్, డిమాండ్ అన్నీ పెరిగిపోయాయి. అమరన్ ఇచ్చిన సక్సెస్ జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెట్టారు శివ కార్తికేయన్.
ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న శివ కార్తికేయన్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. అందులో భాగంగానే లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ఓ సినిమా చేస్తున్నారు శివ. సుధా కొంగర గురించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సూరరై పొట్రు సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి ప్రశంలందుకున్న ఆమె ఇప్పుడు శివ కార్తికేయన్ తో సినిమా చేస్తున్నారు.
పరాశక్తి అనే టైటిల్ తో తెరెక్కుతున్న ఈ సినిమాలో జయం రవి, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించనుండగా డాన్ పిక్చర్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్, తిరుచరాపల్లి పరాశక్తి సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాషష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొన్నా మధ్య మేకర్స్ టీజర్ రిలీజ్ చేయగా ఆ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ కార్తికేయన్ ను సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాన్ని సుధా కొంగర రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలో తాను రాసుకున్న పాత్రకు శివ కార్తికేయన్ సరిగ్గా సరిపోతాడని, పక్కింటి అబ్బాయి లుక్ లో కనిపించే శివ సిన్సియారిటీ, అతనికుండే క్లారిటీ సినిమాలో తన హీరో పాత్రకు దగ్గరగా ఉంటాయని, అందుకే శివ కార్తికేయనే ఈ సినిమాకు సరైన ఎంపిక అని అతన్ని తీసుకున్నట్టు సుధా కొంగర తెలిపారు.
