అమరన్ తో భారీ హిట్.. కానీ ఇప్పుడు నో సౌండ్..
రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన సినిమాలో విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, విక్రాంత్, షబీర్ కల్లరక్కల్ కీలక పాత్రలు పోషించారు.
By: Tupaki Desk | 4 Sept 2025 11:38 PM ISTకోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్.. రీసెంట్ అమరన్ మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. 2014లో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో రూపొందిన ఆ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా అలరించింది. రూ.335 కోట్లు సాధించింది.
ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చి కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో శివకార్తికేయన్ అప్ కమింగ్ చిత్రాలపై అందరి ఫోకస్ పడింది. ఇప్పుడు ఆయన మదరాసి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన సినిమా విడుదల కానుంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా మదరాసిని ఏఐర్ మురుగుదాస్ తెరకెక్కించారు.
రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన సినిమాలో విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, విక్రాంత్, షబీర్ కల్లరక్కల్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్. శ్రీలక్ష్మి ప్రసాద్ నిర్మించారు. అయితే అమరన్ వంటి విజయం తర్వాత శివకార్తికేయన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్, అభిమానులు అంతా అంచనాలు పెట్టుకున్నారు.
అదే సమయంలో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని అంచనా వేశారు. ఎందుకంటే తుపాకీ, కత్తి, గజినీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్న ఆయన.. కొంతకాలంగా సరైన హిట్ ను అందుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మదరాసితో అలరిస్తారని.. కమ్ బ్యాక్ ఇస్తారని సినీ ప్రియులు ఊహించారు.
అదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు సినిమాపై ఎలాంటి సౌండ్ లేదు. రిలీజ్ కు మరికొన్ని గంటల సమయమే ఉన్నా.. పెద్దగా మూవీ సందడి కనపడడం లేదు. తెలుగులో అలా అనుకుంటే కోలీవుడ్ లో పరిస్థితి అలాగే ఉంది. అక్కడ ఆయనకు మంచి క్రేజ్ ఉన్నా కూడా సినిమాపై బజ్ యావరేజ్ గా ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అమరన్ తో రూ.300 కోట్ల హిట్ అందుకున్నా ఇప్పుడు సౌండ్ లేకపోవడం గమనార్హం. ఆ రేంజ్ హైప్ లేకపోవడం కాస్త కలవరపెట్టే విషయం. దీంతో అమరన్ కు వచ్చిన ఓపెనింగ్స్.. ఇప్పుడు రావడం కష్టంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మౌత్ టాక్ పాజిటివ్ గా.. స్ట్రాంగ్ గా ఉంటే తప్ప సాలిడ్ వసూళ్లు రాబట్టదని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో.. సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.
