శివకార్తికేయన్‌తో దళపతి డైరెక్టర్ క్రేజీ ఫిల్మ్!
గత ఏడాది `అమరన్`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న క్రేజీ హీరో శివ కార్తీకేయన్ ఈ ఏడాది మరో విభహిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
By: Tupaki Desk | 9 Jun 2025 9:00 PM ISTగత ఏడాది `అమరన్`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న క్రేజీ హీరో శివ కార్తీకేయన్ ఈ ఏడాది మరో విభహిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `మదరాసి`. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్టర్. ఆయనకిది డైరెక్టర్‌గా లైఫ్ అండ్ డెత్ మూవీ. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
గత సినిమాలకు పూర్తి భిన్నమైన పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో శివ కార్తికేయన్ నటిస్తున్నారు. దీనితో పాటు ఆయన సుధా కొంగర డైరెక్షన్‌లో ఓ యదార్థ గాధ ఆధారంగా రూపొందుతున్న `పరాశక్తి`లో నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో జయం రవి, అధర్వ, మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తుండగా ఉదయనిధి స్టాలిన్ రెడ్ జైంట్ మూవీస్‌పై మద్రాస్ అంతటా రిలీజ్ చేయబోతున్నారు.
వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా భారీ స్థాయిలో తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శివ కార్తికేయన్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాజెక్ట్‌ని దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయనున్నారు. విజయ్ గోట్ మూవీలో శివ కార్తీకేయన్ చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేయడం తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే ఈ విషయాన్ని స్పష్టం చేసిన వెంకట్ ప్రభు ఈ మూవీని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారని ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్న వెంకట్ ప్రభు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట.