Begin typing your search above and press return to search.

ఈ టైమ్‌లో అతడితో అవసరమా భయ్యా...!

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మోస్ట్‌ బిజీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న శివ కార్తికేయన్‌ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో పరాశక్తి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   5 May 2025 3:45 PM
ఈ టైమ్‌లో అతడితో అవసరమా భయ్యా...!
X

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మోస్ట్‌ బిజీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న శివ కార్తికేయన్‌ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో పరాశక్తి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. టైటిల్‌ కారణంగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పైగా సుధ కొంగరకి తమిళనాట మంచి క్రేజ్ ఉంది. ఆమె దర్శకత్వంలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా సినిమా సూపర్‌ హిట్‌ను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న ఈమె తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేయబోతుంది అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. సుధ కొంగర తెలుగులో సీనియర్‌ హీరో వెంకటేష్‌ తోనూ సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ తమిళ్‌లో ఈమె సినిమా చేస్తోంది.

తమిళ్‌లో శివ కార్తికేయన్‌తో ఈమె చేస్తున్న పరాశక్తి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ శివ కార్తికేయన్‌ చేస్తున్న ఇతర సినిమాల విషయంలో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈమధ్య కాలంలో అస్సలు ఫామ్‌లో లేని మురుగదాస్‌ దర్శకత్వంలో మదరాసి అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. శివ కార్తికేయన్‌, మురుగదాస్ కాంబో మూవీపై అస్సలు అంచనాలు లేవు. మురుగదాస్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో మదరాసి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో రూపొందించిన సికిందర్‌ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెల్సిందే.

మురుగదాస్‌ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నా శివ కార్తికేయన్‌ అభిమానుల్లో మాత్రం అనుమానాలు ఉన్నాయి. ఆ విషయం గురించి పక్కన పెడితే ఇప్పుడు శివ కార్తికేయన్‌ తన తదుపరి సినిమాను వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో చేసేందుకు సిద్ధం అయ్యాడు. వీరిద్దరి కాంబోలో కొత్త సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రముఖ నిర్మాత వీరి కాంబో మూవీని సినిమాను నిర్మించేందుకు గాను సిద్ధం అవుతున్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం చేస్తున్న పరాశక్తి, మదరాసి సినిమాలు పూర్తి అయిన తర్వాత వెంకట్‌ ప్రభు సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వెంకట్‌ ప్రభుతో సినిమాలు చేసేందుకు ప్రముఖ దర్శకులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈయన మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

శివ కార్తికేయన్‌ ప్రస్తుతం చేస్తున్న పరాశక్తి విషయంలో కాస్త పాజిటివ్‌ బజ్‌ ఉంది. ఆ తర్వాత రెండు సినిమాల విషయంలో అనుమానాలు ఉన్నాయి. అయితే వారిద్దరూ గతంలో సూపర్ హిట్‌ సినిమాలు చేసిన దర్శకులే... అయినప్పటికీ ఈ మధ్య కాలంలో వారు తీసిన సినిమాల కారణంగా అనుమానాలు ఉన్నాయి. శివ కార్తికేయన్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్స్‌, లవ్‌ స్టోరీ సినిమాలు చేస్తే బాగుంటాయని, యాక్షన్‌ సినిమాలు, సీరియస్ కంటెంట్‌ సినిమాలు చేయడం అవసరమా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో శివ కార్తికేయన్‌ సినిమాల ఎంపిక విషయంలో ప్రస్తుతం ఉన్న క్రేజ్‌, జోష్ నేపథ్యంలో ఔట్‌ డేటెడ్‌ దర్శకులతో సినిమాలు అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. ముందు ముందు అయినా శివ కార్తికేయన్‌ కాస్త జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.