Begin typing your search above and press return to search.

ఆదికేశవ మనసు దోచేసిన సిత్తారాల సిత్రావతి

సిత్తారాల సిత్రావతి మతి పోగొట్టావే అంటూ సాగుతోంది. పాట వినడానికి బాగుంది. లొకేషన్లు అయితే మరింత బాగున్నాయి. ఈ పాటలో వైష్ణవ్, శ్రీలీల జోడి చూడటానికి అద్భుతంగా ఉంది.

By:  Tupaki Desk   |   6 Sep 2023 12:25 PM GMT
ఆదికేశవ మనసు దోచేసిన సిత్తారాల సిత్రావతి
X

మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ సరికొత్త సినిమా ఆదికేశవ. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు రెడీగా ఉంది. నిజానికి ఈ సినిమాఓ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, వాయిదా పడుతూ వచ్చింది. జూన్ లో విడుదల చేద్దాం అనుకున్నారు. వాయిదా వేస్తూ వేస్తూ నవంబర్ కి తీసుకువచ్చారు.


శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కొంత కాలం క్రితం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అది విపరీతంగా ఆకట్టుకుంది. తొలిసారి వైష్ణవ్ ఫుల్ యాక్షన్ మూవీలో నటించినట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఓ పాటను విడుదల చేశారు. శ్రీలీల, వైష్ణవ్ ల మధ్య సాగే పాట ఇది. సిత్తారాల సిత్రావతి మతి పోగొట్టావే అంటూ సాగుతోంది. పాట వినడానికి బాగుంది. లొకేషన్లు అయితే మరింత బాగున్నాయి. ఈ పాటలో వైష్ణవ్, శ్రీలీల జోడి చూడటానికి అద్భుతంగా ఉంది.

ఇది కేవలం సాంగ్ ప్రోమో మాత్రమే, త్వరలోనే మొత్తం పాట విడుదల చేయనున్నారు. కాగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. కాగా ఈ మూవీని నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీలలతో పాటు అపర్ణదాస్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది.

కాగా, శ్రీలల చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న చాలా సినిమాల్లో శ్రీలీలే హీరోయిన్ కావడం విశేషం. విడుదలకు రెడీగా రామ్ స్కంద లోనూ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక , వైష్ణవ్ విషయానికి వస్తే, ఇది ఆయనకు నాలుగో సినిమా. మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వత వచ్చిన కొండపాలెం విమర్శకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన 'రంగరంగ వైభవంగా' డిజాస్టర్‌గా నిలిచింది.కాగా, ఈ ఆదికేశవ తో ఎలాగైనా హిట్ కొట్టాలని వైష్ణవ్ ఎదురు చూస్తున్నాడు. మరి ఈ మూవీ ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి.