Begin typing your search above and press return to search.

ఆదికేవశతో సిత్రావతి.. ఎంత ముద్దుగున్నారో..

ఆ ఫోటోలో వైష్ణవ్, శ్రీలీల ఇద్దరూ సూపర్ స్టైలిష్ గా కనపడుతున్నారు. శ్రీలల బ్లాక్ స్కర్ట్ లో ఫ్లోరల్ టాప్ లో కనిపించింది. మ్యాచింగ్ షూ ధరించింది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 12:56 PM GMT
ఆదికేవశతో సిత్రావతి.. ఎంత ముద్దుగున్నారో..
X

మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా, క్రేజీ హీరోయిన్ శ్రీలల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఆదికేశవ. ఈ మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో, ప్రమోషన్స్ హీట్ పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, కొన్ని పాటలు నెటిజన్లకు విపరీతంగా నచ్చేశాయి. వైష్ణవ్ సినిమాలు ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ సినిమాతో మరో లెక్క అన్నట్లుగా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. తొలిసారి మాస్ యాంగిల్ ట్రై చేశాడు.


శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఇతర సినిమాల కారణంగా, ఈ మూవీ కలెక్షన్ల పై ప్రభావం చూపుతుందేమో అనే కారణంతో, దీనిని వాయిదా వేస్తూ వచ్చారు. నిజానికి జూన్ రావాల్సిన సినిమా, నవంబర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే, ఈ గ్యాప్ వీరికి మూవీని ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకువెళ్లడానికి ఉపయోగపడింది. నెమ్మదిగా, పాటలు, ప్రోమోలతో హీట్ పెంచుతున్నారు.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ పాటను విడుదల చేశారు. శ్రీలీల, వైష్ణవ్ ల మధ్య సాగే పాట ఇది. సిత్తారాల సిత్రావతి మతి పోగొట్టావే అంటూ సాగుతోంది. పాట వినడానికి బాగుంది. లొకేషన్లు అయితే మరింత బాగున్నాయి. ఈ పాటలో వైష్ణవ్, శ్రీలీల జోడి చూడటానికి అద్భుతంగా ఉంది. ఈ పాట ప్రోమోలో భాగంగానే ఓ ఫోటో కూడా విడుదల చేశారు.

ఆ ఫోటోలో వైష్ణవ్, శ్రీలీల ఇద్దరూ సూపర్ స్టైలిష్ గా కనపడుతున్నారు. శ్రీలల బ్లాక్ స్కర్ట్ లో ఫ్లోరల్ టాప్ లో కనిపించింది. మ్యాచింగ్ షూ ధరించింది. వైష్ణవ్ కార్గో ప్యాంట్ ధరించారు. కళ్లద్దాలు పెట్టుకొని ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్ ఫోజ్ ఇచ్చారు. కాగా, ఈ పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు.

కాగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. కాగా ఈ మూవీని నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీలలతో పాటు అపర్ణదాస్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది.