Begin typing your search above and press return to search.

శ్రీలీల, సితార… సందడంతా వారిదే

అందరిలో జోష్ నింపారు. వీరిద్దరు ఫుల్ గా అల్లరి చేస్తూ కలిసి దిగిన ఫోటోలని సితార తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. అలాగే శ్రీలీల హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 8:12 AM GMT
శ్రీలీల, సితార… సందడంతా వారిదే
X

గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది. కమర్షియల్ జోనర్ లో సూపర్ స్టార్ ఖాతాలో మరో హిట్ బొమ్మగా మారేలా కనిపిస్తోంది. మిక్సడ్ టాక్ తో ఆరంభమైన సూపర్ స్టార్ మహేష్ వన్ మెన్ షోకి ఆడియన్స్ భాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ సక్సెస్ ని తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు.


దిల్ రాజు, నాగ వంశీ, మీనాక్షి చౌదరి, శ్రీలీలతో పాటు మహేష్ బాబు ఫ్యామిలీ అందరూ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సరదాగా సంక్రాంతి వేడుకలు చేసుకొని మూవీ సక్సెస్ ని ఆశ్వాదించారు. ఇక ఈ ఏడాది శ్రీలీల ఖాతాలో గుంటూరు కారం సినిమాతో ఓ హిట్ పడబోతోందని తెలుస్తోంది. ఇక కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల ఈ సినిమాలో తన డాన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.


ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీలీలతో డాన్స్ చేయడం చాలా కష్టం అన్నాడంటే ఏ స్థాయిలో ఆమె డాన్స్ టాలెంట్ చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మహేష్ బాబు ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ లో కూడా శ్రీలీల సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అలాగే మహేష్ బాబు కూతురు సితార సందడి కూడా కనిపించింది. శ్రీలీల, సితార భాగా క్లోజ్ అయిపోయి ఈ పార్టీలో ఫుల్ గా సందడి చేశారు.


అందరిలో జోష్ నింపారు. వీరిద్దరు ఫుల్ గా అల్లరి చేస్తూ కలిసి దిగిన ఫోటోలని సితార తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. అలాగే శ్రీలీల హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి ఇక సితార తోడైతే ఆ సందడి నెక్స్ట్ లెవల్ లో ఉండి ఉంటుందని సూపర్ స్టార్ అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి గుంటూరు కారం సక్సెస్ తో మహేష్ బాబు ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు తన ఫ్యామిలీతో పాటు మూవీ టీంతో కలిసి చేసుకున్నారని అర్ధమవుతోంది.

ఇక ఈ స్థాయిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో సరదా సందడి మరో మూడేళ్ళ వరకు అభిమానులు చూడలేకపోవచ్చు. ప్రస్తుతం మహేష్ జక్కన్న సినిమాపై ఫోకస్ చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కావడానికి చాలా టైం పట్టేస్తుంది. అప్పుడు మహేష్ బాబు ఇక పాన్ ఇండియా స్టార్ గా మారిపోతాడు.