సితార చేస్తుంది కరెక్టేనా..?
సితార బ్యానర్ నుంచి ధనుష్ సార్ వచ్చింది. అది మంచి సక్సెస్ అందుకుంది. ఇక లాస్ట్ ఇయర్ దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చేశారు.
By: Ramesh Boddu | 11 Oct 2025 12:10 PM ISTటాలీవుడ్ లో మంచి నిర్మాణ సంస్థగా సితార ఎంటర్టైమెంట్స్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ ఆడియన్స్ లో ఈ సంస్థకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పడేలా చేసుకున్నారు. ఐతే సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు సితార బ్యానర్ నిర్మాతలు. ఐతే ఈ నిర్మాణ సంస్థ ఓ పక్క తెలుగు స్టార్స్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషలకు సంబందించిన హీరోలతో ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. అది కూడా డిఫరెంట్ కథలతో ఈ అప్రోచ్ ఉంటుంది.
దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్..
సితార బ్యానర్ నుంచి ధనుష్ సార్ వచ్చింది. అది మంచి సక్సెస్ అందుకుంది. ఇక లాస్ట్ ఇయర్ దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చేశారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆల్రెడీ సూర్య తో ఒక సినిమా సెట్స్ మీద ఉంది. లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. సితార బ్యానర్ నుంచి రాబోతున్న క్రేజీ సినిమాల్లో ఇది ఒకటని తెలుస్తుంది.
ఇప్పుడు మరో తమిళ స్టార్ తో సితార సినిమా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈసారి కోలీవుడ్ స్టార్ శింబుతో సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా ప్లానింగ్ ఉందట. ఆల్రెడీ కథా చర్చలు పూర్తయ్యాయట. మనసామహ షార్ట్ ఫిలిం తో ఎన్నో అవార్డులు అందుకున్న దీపక్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. శింబుకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండు దశాబ్దాల క్రితం అతను చేసిన మన్మధ, వల్లభ సినిమాలు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి.
మన హీరోలు కాదని సితార అక్కడిదాకా..
ఇప్పుడు ఆ స్టార్ హీరో శింబు తో తెలుగు సినిమా చేస్తున్నారు. ఐతే సితార మంచి కథలను తమిళ హీరోలతో చేయడం పట్ల ఆడియన్స్ లో కొందరు డిజప్పాయింట్ అవుతున్నారు. మన హీరోలు కాదని సితార అక్కడిదాకా ఎందుకు వెళ్తుంది అని అంటున్నారు. ఐతే మన హీరోలంతా ఆల్రెడీ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. సితార ఆల్రెడీ టాలీవుడ్ హీరోలందరితో సినిమాలు చేస్తుంది. ఐతే కొన్ని డిఫరెంట్ స్టోరీస్ తెలుగు హీరోలు చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు.
అలాంటి కథలను ఇతర భాషా హీరోలతో చేస్తున్నారు. సూర్యతో సినిమానే కాదు సితార బ్యానర్ లో ఈమధ్యనే రిషబ్ శెట్టి హీరోగా ఒక పీరియాడికల్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. సో సితార బ్యానర్ కూడా తమ బ్యానర్ ని పాన్ ఇండియా లెవెల్ లో విస్తరించే భాగంగానే ఈ ప్రాజెక్ట్ లు చేస్తుందని అనిపిస్తుంది.
