60 ఏజ్ హీరో ఇంకా కుర్రాడినే అనే భ్రమలో!
ఇది భ్రమ మాత్రమేనని అంగీకరించలేరు! అలాంటి వారి జాబితాలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు.
By: Tupaki Desk | 1 Jun 2025 4:00 PM ISTచాలా మంది హీరోలు తాము ఇంకా యుక్త వయస్కులమే అనుకుంటారు. ఇది భ్రమ మాత్రమేనని అంగీకరించలేరు! అలాంటి వారి జాబితాలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు. అతడు ఇంకా 20 ప్లస్ కుర్రాడిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు తారే జమీన్ పార్ సీక్వెల్ `సితారే జమీన్ పార్` కోసం తన లుక్ ని మార్చడం ఆశ్చర్యపరిచింది.
నిజానికి అమీర్ ఇప్పటికే వృద్ధుడు. 60 వయసు(14 మార్చి 2025 నాటికి)లో అతడిని ఇంకా కుర్రాడే అని ఎలా అనగలం? కానీ ఇతర ఖాన్‌ల మాదిరిగానే షష్ఠి పూర్తికి చేరువైనా, ఇంకా కుర్రాడినే అనుకునే తత్వం అతడిది అని నెటిజనులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలే తన మూడో భార్యను కూడా మీడియాకు పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ప్రత్యేకించి అమీర్ ఖాన్ ఏజ్ గురించి ఎందుకు గుర్తు చేసుకోవాలి? అంటే .. అతడు చేసిన ప్రకటన అలా ఉంది.
మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్. బహుశా ఇది నా చిట్టచివరి ప్రాజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత నటించలేనేమో! అని అమీర్ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఈ ప్రాజెక్ట్ తనకు పూర్తి జీవితకాల సంతృప్తిని మిగులుస్తుందని భావిస్తున్నట్టు తెలిపాడు. ఇంతకుముందు హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూలో మహాభారతం కోసం నటీనటుల ఎంపిక జరుగుతుందని, ఇందులో తాను నటిస్తాడా లేదా? అన్నది చెప్పలేనని అన్నాడు. తాను డైరెక్టర్ గా పని చేస్తానని మాత్రమ చెప్పాడు. పాత్రకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకుంటానని అమీర్ చెప్పాడు.
