Begin typing your search above and press return to search.

ఎస్ ఎస్ ఎంబీ 29 తో సితార లాంచ్!

త్వ‌ర‌లోనే సినిమాకి సంబంధించిన వ‌ర్క్ షాప్స్ మొదలు పెట్ట‌డానికి రాజ‌మౌళి రెడీ అవుతున్నారు

By:  Tupaki Desk   |   24 Feb 2024 11:30 PM GMT
ఎస్ ఎస్ ఎంబీ 29 తో సితార లాంచ్!
X

ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రంతో సితార లాంచ్ కి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయా? తండ్రీ-కుమార్తెల్ని ఒకే ప్రేమ్ లో చూపించ‌డానికి ద‌ర్శ‌క‌శిఖ‌రం సిద్ద‌మ‌వుతోందా? అంటే అవున‌నే స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. మ‌హేష్ తొలిపాన్ ఇండియా చిత్రం కోసం కొన్ని నెల‌లుగా స‌న్న‌ధం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే జర్మ‌నీలో అవ‌స‌ర‌మైన ట్రైనింగ్ పూర్తి చేసాడు. త్వ‌ర‌లోనే సినిమాకి సంబంధించిన వ‌ర్క్ షాప్స్ మొదలు పెట్ట‌డానికి రాజ‌మౌళి రెడీ అవుతున్నారు.

నాలుగైదు నెల‌ల పాటు ఈ వ‌ర్క్ షాప్స్ ఉంటాయ‌ని స‌మాచారం. ఈ వ‌ర్క్ షాప్స్ లో మ‌హేష్ తో పాటు సితార కూడా పాల్గొంటుంద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. దీంతో సినిమాలో సితార కూడా న‌టిస్తుందా? అన్న హింట్ లీకైంది. ఈ చిత్రాన్ని రాజ‌మౌళి ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో తెలిసిందే. ఆఫ్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

గ్లోబ్ ట్రాటింగ్ జాన‌ర్ లో రూపొందుతుంది. పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ నే షేక్ చేసే బిహైండ్ ఐడి యాతో రంగంలోకి దిగుతున్నారు. మ‌రి ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం క‌న్నా సితార‌కు గొప్ప లాంచింగ్ ఎక్క‌డ దొరుకుతుంది? అంటే అందుకు ఛాన్సే లేద‌ని చెప్పాలి. ఇలాంటి సినిమాలో సితార‌కు బ‌రువైన ఓ పాత్ర బాధ్య‌త‌లు ఇస్తే స‌రి. తండ్రికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంటుంది. ఇప్ప‌టికే సితార లో సినిమా ఫ్యాష‌న్ అనేది ఏ స్థాయిలో ఉంది? అన‌డానికి ఎన్నో ఆధారాలున్నాయి.

సితార న‌ర‌న‌ర‌నా సినిమా ఉంది. చిన్న వ‌య‌సులోనే డాన్సులో ఆరితేరింది. చాలా ఈజీగా డాన్సు చేస్తుంది. కెమెరా ఫియ‌ర్ అన‌డానికి ఛాన్సేలేదు. తాత‌య్య సూప‌ర్ స్టార్ స్టార్..తండ్రి వార‌త‌స్వాన్ని త‌న‌యుడు కొన‌సాగిస్తున్నాడు. ఇప్పుడు అదే తండ్రి వార‌త‌స్వాన్ని సితార రూపంలో ముందుకు తీసుకెళ్ల‌డానికి రెడీగా ఉంది. కాబ‌ట్టి సితార‌కి ఇంత‌క‌న్నా మంచి సినిమాగానీ... మంచి టైమింగ్ గానీ.. ద‌ర్శ‌కుడు కానీ కుద‌ర‌డు. ఆమె లాంచింగ్ అన్ని ర‌కాలుగా ఇదే స‌రైన స‌మ‌యమ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఇప్పుడు క‌న్ప‌ర్మేష‌న్ కోసం ఎదురు చూస్తున్నారు.