Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : లండన్ వీధుల్లో క్యూట్‌ సీతూ పాప

టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్ బాబు కూతురు సితార గురించి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి

By:  Tupaki Desk   |   3 Aug 2023 8:06 AM GMT
పిక్ టాక్ : లండన్ వీధుల్లో క్యూట్‌ సీతూ పాప
X

టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్ బాబు కూతురు సితార గురించి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. సాధారణంగా స్టార్‌ హీరోల పిల్లల గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు రాకుండా జాగ్రత్త పడుతారు. కానీ సీతూ పాప మాత్రం రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది.


చిన్న వయసులోనే సంపాదన మొదలు పెట్టిన సీతూ పాప ప్రస్తుతం మోస్ట్‌ పాపులర్‌ సెలబ్రెటీల జాబితాలో నిలిచింది. సోషల్‌ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సితార యూట్యూబ్ లో కూడా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుని అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం అమ్మా నాన్నలతో కలిసి సితార లండన్‌ లో ఉంది. లండన్ వీధుల్లో క్యూట్‌ క్యూట్‌ సితార ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఫోటో షూట్‌ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంది.

ఇటీవల ఒక కమర్షియల్‌ యాడ్‌ లో సొంతంగా నటించడంతో ఇండస్ట్రీలో కూడా సితార అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మహేష్ బాబు కూతురుగా కాకుండా సితారకు ఇప్పుడు సొంత ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు సితార సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌ గా మారే అవకాశాలు ఉన్నాయి. ముందు ముందు సితారను వెండి తెరపై చూసే అవకాశాలు లేకపోలేదు.