Begin typing your search above and press return to search.

తొలి పారితోషికం చారిటీకి విరాళం ఇచ్చిన సితార‌!

మ‌హేష్ న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార

By:  Tupaki Desk   |   15 July 2023 11:30 AM GMT
తొలి పారితోషికం చారిటీకి విరాళం ఇచ్చిన సితార‌!
X

మ‌హేష్-న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార న‌టి కాక‌ముందే? బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఓ ప్ర‌ముఖ జ్యూవెల‌రీ ని ప్ర‌మోట్ చేస్తూ సితార చేసిన యాడ్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఈ యాడ్ కి సితార కోటి రూపాయ‌లు పారితోషికం అందుకున్న‌ట్లు స‌మాచారం.

మ‌రి తొలిపారితోషికం సితార ఏం చేసింది? వ్య‌క్తివ‌త ఖ‌ర్చుల‌కు పాకెట్ మ‌నీగా ఉంచుకుందా? లేక మ‌మ్మి డాడీల‌లో ఎవ‌రికైనా ఇచ్చిందా? అన్న ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ సితార ముందుకెళ్లే స‌రికి ఎవ‌రూ ఊహించ‌ని స‌మాధానం ఇచ్చింది సీతా పాప‌.

ఓ ఛారిటీకి విరాళంగా ఇచ్చిన‌ట్లు సితార తెలిపింది. సూప‌ర్ స్టార్ లాగే త‌న‌యది కూడా మంచి మ‌న‌సుని చెప్పొచ్చు. సూప‌ర్ స్టార్ ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు చేయిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కాపాడి ఆ త‌ల్లిదండ్రుల క‌ళ్ల‌లో ఆనందం నింపారు మ‌హేష్‌. ఏటా ఆయ‌న కొన్ని వంద‌ల ఆప‌రేష‌న్లు కార్పోరేట్ ఆసుప‌త్రుల్లో ఉచితంగానే చేయిస్తున్నారు.

సితార కూడా తండ్రి లాగే సేవా కార్య‌క్ర‌మాలు చేసే దృక్ఫ‌దం ఉన్న అమ్మాయి లా క‌నిపిస్తోంది. ఇక న‌మ్ర‌త సితార కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. పిల్ల‌లు ఇద్ద‌రు ఏ రంగంలో రాణించాలనుకుంటే ఆ రంగంలోకి వెళ్తారు.

మ‌హేష్ గానీ...నేను గానీ వాళ్ల‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాం. ఫ‌లానా రంగంలోకి వెళ్లండని స‌ల‌హాలుగానీ..బ‌ల‌వ‌త్తం చేయ‌డం గానీ చేయం. ఏ ప‌నికి ప్ర‌త్యేక‌మైన స్ట్రాట‌జీ అంటూ ఏమీ ఉండ‌దు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వాటంత‌ట‌వే జ‌రిగిపోతుంటాయి.

మ‌హేష్ ఎప్పుడూ సినిమాల‌తో బిజీగా ఉంటారు. ఇంటి ప‌నులతో నేను క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాను. పిల్ల‌లు వాళ్ల ఫ్యాష‌న్ గురించి పెద్ద‌గా ఆలోచించ‌లేదు. వాళ్ల ఫ్యాష‌న్ ఎటువైపు ఉంటే ఆటెళ్తారు. కానీ సితార‌కి సినిమాలంటే ఫ్యాష‌నేట్ గా ఉంటుంది. ఇక సితారకి ఈ యాడ్ లో న‌టించే అవ‌కాశం ఎందుకు ఇచ్చారో? నాకు తెలియ‌దు. ఆ విష‌యం వాళ్ల‌నే అడ‌గాలి అని అన్నారు.