Begin typing your search above and press return to search.

వీడియో: డాడ్ పాట‌కు సితార క్లాసీ స్టెప్పులు

ఇప్పుడు అలాంటి మ‌రో అద్భుత‌మైన వీడియో అభిమానుల ముందుకు వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 5:05 PM GMT
వీడియో: డాడ్ పాట‌కు సితార క్లాసీ స్టెప్పులు
X

క్యూట్ క్యూట్ గా అల్ల‌ర‌ల్ల‌రిగా క‌నిపించే సితార డ్యాన్సుల్లోను ప్రావీణ్యురాలు. అక‌డమిక్ స్టడీస్ కొన‌సాగిస్తూనే క్లాసిక‌ల్ డ్యాన్స్ లో నిపుణురాలైంది. సితార క్లాసిక్ డ్యాన్సుల‌కు సంబంధించి ఇంత‌కుముందు కొన్ని వీడియోలు అంతర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. త‌న కుమార్తెలోని అన్ని క్వాలిటీస్ కి సంబంధించిన చాలా స‌మాచారాన్ని విరివిగా ఫోటోలు, వీడియోల రూపంలో న‌మ్రత శిరోద్క‌ర్ ఇన్ స్టా మాధ్య‌మంలో షేర్ చేయ‌గా దానికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఇప్పుడు అలాంటి మ‌రో అద్భుత‌మైన వీడియో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఈ వీడియోలో సితార ఘ‌ట్ట‌మ‌నేని గుంటూరు కారంలోని పాట‌కు డ్యాన్సులు చేస్తూ క‌నిపించింది. మ‌హ‌ష్ న‌టించిన ఈ సినిమాలోని పెప్పీ నంబ‌ర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ కి సితార క్లాసీ స్టెప్పులు ఎంతో అద్భుతంగా కుదిరాయి. సితార చాలా సింపుల్ గా ఫ్రీ స్ట‌యిల్ లో పాట‌కు నృత్యం చేస్తుంటే హృద‌యాన్ని మీటే పెప్ క‌నిపించింది. సితార ఘ‌ట్ట‌మ‌నేని స్వ‌యంగా ఇన్ స్టాలో ఈ వీడియోని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇది అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. మ‌హేష్ ఫ్యాన్స్ దీనిని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

అనాధ పిల్ల‌ల కోసం షో:

తాజా స‌మాచారం మేర‌కు అనాధ పిల్ల‌ల కోసం గుంటూరు కారం స్పెష‌ల్ షోని సితార ఘ‌ట్ట‌మ‌నేని హోస్ట్ చేస్తున్నారు. ప్ర‌తిసారీ మ‌హేష్ కుటుంబీకులు అనాధ‌ల కోసం ఇలాంటి స్పెష‌ల్ షోలను స్క్రీనింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు చిన్నారి సితార ఘ‌ట్ట‌మ‌నేని ఒక మంచి కాజ్ కోసం ఇలా ముందుకు రావ‌డాన్ని అభిమానులు హ‌ర్షిస్తున్నారు.

మహేష్ బాబు నటించిన `గుంటూరు కారం` సంక్రంతి బ‌రిలో విడుదలై థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ టాలీవుడ్ అభిమానులకు, ప్రేక్షకులకు సంక్రాతి పండగను తెచ్చింది. మహేష్ బాబు- శ్రీలీల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఈ చిత్రం చాలా ప్రశంసలు అందుకుంది. మహేష్ బాబు- శ్రీలీల కాంబినేష‌న్ `కుర్చి మడతపెట్టి` పాట ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఇక శ్రీలీల డ్యాన్సుల‌ను మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని ఎంత‌గానో అభిమానించారు. శ్రీలీల డ్యాన్సుల గురించి సితార ఎగ్జ‌యిట్ అవుతూ ప్ర‌శంసించారు.

అలాగే గుంటూరు కారం సినిమాకి సితార సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్ ఆస‌క్తిని క‌లిగించింది. ఇందులోంచి పాటలు, యాక్షన్ సన్నివేశాలను సితార త‌న ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. సితార ఇప్పుడు సోలో డ్యాన్సుల‌తో గుంటూరు కారం చిత్రానికి మ‌రింత ప్ర‌చారం క‌ల్పిస్తోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు త‌దుప‌రి SS రాజమౌళితో కలిసి పని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి తాత్కాలికంగా SSMB29 అని పేరు పెట్టారు. మ‌హేష్ ఈ సినిమా గురించి చ‌ర్చించేందుకు విదేశీ ట్రిప్ వెళ్లార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి.