Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కూతురి పెళ్లి.. నమ్రత, సితార ఇలా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి మాములుగా లేదు. వరుస వివాహాలు, శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   15 March 2024 7:19 AM GMT
స్టార్ హీరో కూతురి పెళ్లి.. నమ్రత, సితార ఇలా..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి మాములుగా లేదు. వరుస వివాహాలు, శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటీమణులు అస్మిత, మీరా చోప్రా ఇటీవల తమ భాగస్వాములతో ఏడడుగులు నడిచారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. తన ప్రేయసి, హీరోయిన్ రహస్య గోరఖ్ తో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి.


వెంకటేష్ చిన్న కుమార్తె హయ వాహిని.. ఈరోజే వివాహ బంధంలో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఈ స్టార్ కిడ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో హయ వాహిని ఎంగేజ్మెంట్ జరగ్గా.. అప్పట్లో ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. మహేష్, చిరంజీవి తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు.. హయ వాహిని వివాహ వేడుకలు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో జరుగుతున్నట్లు సమాచారం.


కేవలం వధూవరుల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలకు మాత్రమే హయ వాహిని వివాహ వేడుకలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. చాలా సింపుల్ గా పెళ్లి జరుగుతున్నట్లు సమాచారం. అయితే నిన్న రాత్రి.. హయ వాహిని మెహందీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తోపాటు కూతురు సితార హాజరయ్యారు.అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు బయటకొచ్చాయి.

నమ్రత క్రీమ్ కలర్ లెహంగాలో మెరవగా.. సితార బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. అయితే వధూవరులతో కలిసి నమ్రత దిగిన పిక్ కు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. హయ వాహినికి కంగ్రాట్స్ చెబుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో మహేశ్ ఫ్యామిలీ మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. సితార ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ తన క్యూట్ నెస్ ను కొనియాడుతున్నారు.

అయితే హయ వాహిని మ్యారేజ్ పై ఇప్పటి వరకు వెంకీ మామ ఫ్యామిలీ నుంచి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. వివాహం జరిగిన తర్వాత ఫొటోలు రివీల్ చేస్తారేమో చూడాలి. వెంకటేష్ పెద్ద కుమార్తె, ఫుడ్ వ్లాగర్ ఆశ్రితకు హైదరాబాద్‌కు చెందిన వినాయక్ రెడ్డితో 2019లో రాజస్థాన్ లో వివాహం జరిగింది. ఇక మూడో కుమార్తె భావన, కుమారుడు అర్జున్ ప్రస్తుతం చదువుకుంటున్నారు. ఎనీ వే.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హయ వాహిని!