Begin typing your search above and press return to search.

స్విస్ మంచు కొండ‌ల్లో సితార‌- గౌత‌మ్ విహారం

ఇప్పుడు గౌత‌మ్ మ‌మ్మీ డాడీతో క‌లిసి స్విట్జ‌ర్లాండ్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ బృందంలో సితార ఘ‌ట్ట‌మ‌నేని ఎంతో చిల్లింగ్ గా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   30 March 2024 4:55 AM GMT
స్విస్ మంచు కొండ‌ల్లో సితార‌- గౌత‌మ్ విహారం
X

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ వెకేష‌న్ లో ఉన్నారు. 'గుంటూరు కారం'లో చివరిగా కనిపించిన మహేష్ త‌దుప‌రి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల్సి ఉంది. దీనికోసం ఇప్ప‌టికే చాలా క‌స‌ర‌త్తులు కూడా చేసాడు. ప్రస్తుతం చిన్న‌పాటి ఫ్యామిలీ వెకేష‌న్ తో అత‌డు రిలాక్స్ అవుతున్నాడు. తన తదుపరి సినిమా సెట్స్ కి వెళ్ల‌క ముందే అత‌డు కొంత సమయం ఫ్యామిలీ కోసం తీసుకుంటున్నారు. మ‌హేష్ తన భార్య, పిల్ల‌ల‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితారతో కలిసి మహేష్ బాబు వెకేష‌న్‌కి వెళుతున్న‌ప్ప‌టి ఫోటోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి.

సెలవులను ఆస్వాధించేందుకు వీరంతా స్విట్జ‌ర్లాండ్ లో అడుగుపెట్టారు. మ‌హేష్ ఎప్పుడూ త‌న కుటుంబం కోసం కావాల్సినంత స‌మ‌యం కేటాయిస్తారు. విహార‌యాత్ర‌ల‌ను ఆస్వాధిస్తారు. ఇప్పుడు మ‌హేష్‌-న‌మ్ర‌త బృందం తమ సెలవులను ఆనందిస్తున్నారు. కొన్ని నెలల క్రితం గౌతమ్ తన సెమిస్టర్ కోర్సును USలో ప్రారంభించే ముందు కుటుంబం కలిసి దుబాయ్‌కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు గౌత‌మ్ మ‌మ్మీ డాడీతో క‌లిసి స్విట్జ‌ర్లాండ్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ బృందంలో సితార ఘ‌ట్ట‌మ‌నేని ఎంతో చిల్లింగ్ గా క‌నిపిస్తోంది. మంచు కొండ‌ల్లో మైన‌స్ డిగ్రీల చ‌లిలో విహార‌యాత్ర సాహ‌స‌మే అయినా కానీ, వారంతా చిల్డ్ వాతావ‌ర‌ణంలో ఎంతో ఆస్వాధ‌న‌లో మునిగి తేల్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో SSMB 29 చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమా కోసం మ‌హేష్ ప్రీప్రిప‌రేష‌న్ ని కొన‌సాగిస్తున్నారు. ఇందులో విభిన్న‌మైన గెట‌ప్పుల్లో మ‌హేష్ క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తున్నార‌ని టాక్ ఉంది.