పిక్ టాక్ : అక్క చెల్లి కాదు తల్లి కూతురు
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియా సెన్షేషన్ అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 14 April 2025 1:20 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియా సెన్షేషన్ అనడంలో సందేహం లేదు. చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో సితార చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది. సితార ఎప్పుడూ సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. కాస్త పెద్ద అయిన తర్వాత సోషల్ మీడియాలో జాయిన్ కావడంతో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్స్ స్థాయిలో సితారకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 22 లక్షల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సితార రెగ్యులర్‌గా అందమైన, క్యూట్ ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు యాడ్స్‌లో నటిస్తూ, యూట్యూబ్‌లో కనిపిస్తున్న సితార హీరోయిన్ కావాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు.
సితార ప్రస్తుత వయసు 12 ఏళ్లు. ఒకవేళ సితారకు నటనపై ఆసక్తి ఉన్నా ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా దక్కించుకున్న పాపులారిటీ కారణంగా కచ్చితంగా నటిగా ఎంట్రీ ఇస్తే మొదటి సినిమాకే కచ్చితంగా మంచి రీచ్ దక్కించుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సితార మొన్నటి వరకు చిన్న పాప మాదిరిగానే కనిపిస్తూ ఉండేది. కానీ మధ్య కాలంలో చాలా హైట్ అయింది. అంతే కాకుండా హీరోయిన్ మాదిరిగా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. నటిగా ఎంట్రీ ఇవ్వక ముందే సితు పాప సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈసారి తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి తన తల్లి కంటే ఎక్కువ ఎత్తుగా సితార కనిపిస్తుంది. తల్లితో పాటు సేమ్ ఔట్ ఫిట్‌ను ధరించిన సితార చాలా మందిని సర్‌ప్రైజ్ చేసింది. నమ్రత ఎత్తుకు సమానంగా, ఇంకాస్త ఎక్కువగానే సితార ఎత్తు పెరగడం ఆశ్చర్యంగా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోను చూసిన చాలా మంది నమ్రత, సితారలు అక్క చెల్లి అనుకునే అవకాశం ఉందని అంటున్నారు. సితార, నమ్రతలు వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నారు. ఇద్దరు లాంగ్ షాట్‌లో గుర్తు పట్టనట్లుగా ఉన్నారు. అంతే కాకుండా ఇద్దరు కూడా సమానమైన వయసు ఉన్న వారే అనిపిసిస్తుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఈ ఫోటోను చూసి చాలా మంది నమత్ర, సితారలు తల్లి కూతురుగా కాకుండా అక్క చెల్లిగా ఉన్నారని, ఇద్దరు కలిసి నటిస్తే అక్క చెల్లిగా నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి టాలీవుడ్‌తో పాటు చాలా మంది సినీ ప్రముఖులను సైతం ఈ తల్లి కూతురు సర్‌ప్రైజ్ చేశారు. నమ్రత హీరోయిన్‌గా చాలా సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యాయి. పిల్లలు, మహేష్ బాబు యొక్క సినిమా డేట్లు, వ్యాపారాల గురించి నమ్రత చూసుకుంటూ ఉంటారు. బాధ్యతలు తగ్గుతున్న నేపథ్యంలో నమ్రత తిరిగి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. మరి ఆమె రీ ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. 2027లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
