ఫోటో స్టోరి: సితార వైట్ లెహంగా వైబ్స్
తాజాగా సితార వైట్ లెహంగాలో కనిపించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 8 May 2025 1:08 PM ISTసితార ఘట్టమనేని.. పరిచయం అవసరం లేని పేరు. సూపర్ స్టార్ మహేష్ వారసురాలిగా సితారకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అయితే నెమ్మదిగా తండ్రి చాటు బిడ్డ అనే తెరల్ని తొలగించడంలోను సితార ప్రతిభను, ఆకర్షణను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. ఇటీవల పాపులర్ బ్రాండ్లు పోటాపోటీగా సితారతో ప్రచారం చేయించుకునేందుకు ముందుకు వస్తున్నాయి అంటే దాని అర్థం అందం, ఆకర్షణ, క్యూట్ నెస్ లో 12 ఏళ్ల సితార తమ ఉత్పత్తి ప్రచారానికి సరైన ఎంపిక అని కార్పొరెట్ కంపెనీలు భావిస్తుండటమే.
ఇప్పటికే పలు వస్త్ర దుకాణాల ప్రచారంలో తన తండ్రి మహేష్ తో కలిసి సితార ఘట్టమనేని కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ప్రకటన ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. బాలనటిగా ఇప్పటికే తన తండ్రితో కలిసి కనిపించింది. చాలా చిన్న వయసులో సితార ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సితార ఫ్యాషన్ ఎంపికలు, ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా సితార వైట్ లెహంగాలో కనిపించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ లో సితార ఎంతో ముచ్చటగా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫోటోషూట్ లో తన అందమైన చిరునవ్వుతో తండ్రి మహేష్ ని గుర్తు చేస్తోంది. సితార వయసుకు తగ్గ పరిణతితో బ్రాండ్స్ ప్రపంచాన్ని ఏలడం ఖాయమనడానికి ఇది సింబాలిక్.
నేటి జెన్ జెడ్ కిడ్స్‌లో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార మహేష్ నటవారసురాలిగా లెగసీని ముందుకు తీసుకెళుతుందని అభిమానులు భావిస్తున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ వారసురాలు సుహానా తరహాలోనే నటనలో అడుగుపెట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే దీనిపై నమ్రత, మహేష్ ల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది. సితార ప్రస్తుతం తన అకడమిక్ స్టడీస్ ని పూర్తి చేస్తోంది.
