సితారే జమీన్ పర్.. అమీర్ ఖాన్ ప్లాన్ మారిందా?
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ సితారే జమీన్ పర్.
By: Tupaki Desk | 14 Jun 2025 8:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ సితారే జమీన్ పర్. సబ్ కా అప్న అప్న నార్మల్ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఆ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. జెనీలియా కథానాయికగా నటిస్తుండగా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమీర్ తో పాటు అపర్ణ పురోహిత్ సినిమాను నిర్మిస్తున్నారు.
డాలీ అహ్లువాలియా, గుర్ పాల్ సింగ్, బ్రిజేంద్ర కాలా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఆ సినిమా.. జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ మూవీని విడుదల చేయనున్నారు మేకర్స్. రీసెంట్ గా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెల్లగా బజ్ క్రియేట్ అయింది.
అయితే స్పానిష్ మూవీ ఛాంపియన్స్ ఆధారంగా స్పోర్ట్స్ కామెడీ డ్రామా సితారే జమీన్ పర్ తెరకెక్కిస్తున్నట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తున్నప్పటికీ.. మనసును హత్తుకునే భావోద్వేగాలకు మూవీలో ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ఆటల్లో అందరికీ మరో అవకాశం ఇవ్వాలనే అంశాన్ని చెప్పినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
కాగా, సితారే జమీన్ పర్ ను అమీర్ ఖాన్.. పూర్తి స్థాయి విడుదలకు వెళ్లకుండా పరిమిత థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. 1000- 1500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపించింది. ఆడియన్స్ రెస్పాన్స్ తర్వాత స్క్రీన్స్ నెంబర్ ను వీకెండ్ కు పెంచాలని అనుకున్నారట.
దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది ఫ్యాన్స్.. నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు అమీర్ ఖాన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమీర్ ప్లాన్ తో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా ఒప్పుకోలేదట. దీంతో 3000-3500 స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేయమని ఒప్పించారని తెలుస్తోంది.
ముఖ్యంగా అమీర్ కంటెంట్ పై ఎగ్జిబిటర్స్ ఫుల్ నమ్మకంతో ఉన్నారట. కచ్చితంగా ఆడియన్స్ ను సినిమా ఆకట్టుకుంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే అమీర్ ను ఒప్పించారని సమాచారం. ఏదేమైనా మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అదే తేడా కొడితే.. విమర్శలు తప్పవు. మరి సితారే జమీన్ పర్ మూవీ విషయంలో ఏం జరుగుతుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.
