Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా

ఈ ఏడాది బాఫ్టాలో బెస్ట్ బ్రిటీష్ డెబ్యూగా నామినేట్ అయిన 'సిస్ట‌ర్ మిడ్‌నైట్' 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యంత చర్చనీయాంశమైన టైటిల్‌లలో ఒకటి.

By:  Tupaki Desk   |   17 May 2025 7:04 PM IST
సాఫ్ట్ వేర్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా
X

ప్ర‌యోగాత్మ‌క ఆలోచ‌న‌లు, గ‌ట్సీ నిర్ణ‌యాలు కొంద‌రికే సాధ్యం. రెగ్యుల‌ర్ కంటెంట్ కంటే ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ ని ఎంపిక చేసుకోవ‌డానికి ఎప్పుడూ ముందుండే రాధికా ఆప్టే పైన చెప్పిన‌ కేట‌గిరీకి చెందుతుంది. ఆప్టే న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం, 78వ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) నామినీ 'సిస్టర్ మిడ్‌నైట్' మే 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కరణ్ కంధారి దర్శకత్వం వహించారు. ఆయ‌నే ర‌చ‌యిత‌. అలస్టైర్ క్లార్క్, అన్నా గ్రిఫిన్, అలాన్ మెక్ అలెక్స్య నిర్మాత‌లు.

ఈ ఏడాది బాఫ్టాలో బెస్ట్ బ్రిటీష్ డెబ్యూగా నామినేట్ అయిన 'సిస్ట‌ర్ మిడ్‌నైట్' 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యంత చర్చనీయాంశమైన టైటిల్‌లలో ఒకటి. గోల్డెన్ కెమెరా అవార్డ్, డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కు ఈ మూవీ నామినేట్ అయింది. నాలుగు బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్ (BIFA)కి కూడా నామినేట్ అయిన సిస్టర్ మిడ్‌నైట్, ఆస్టిన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో నెక్ట్స్‌ వేవ్ అవార్డుల్లో 'ఉత్తమ చిత్రం'గా పుర‌స్కారం గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా సినీపండ‌గ‌ల్లో స‌త్తా చాటిన చిత్ర‌మిది.

కొత్త‌గా పెళ్ల‌యిన యువ‌తి ముంబై స్ల‌మ్‌లో కాపురం ప్రారంభించాక ఏం జ‌రిగింది? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. భ‌ర్త గంట‌ల త‌ర‌బడి అదృశ్య‌మ‌య్యాక భార్య‌ జీవితంలో అసంతృప్తి ఎలా పేరుకుపోతుందో కూడా ఈ సినిమా ఆవిష్క‌రించింది. సామాన్య ప్ర‌జ‌ల బ‌తుకు వెత‌ల్ని ఇందులో ఎంతో ఎమోష‌న‌ల్‌గా చూపించారు. ఒక మ‌హిళ పెళ్ల‌యిన త‌ర్వాత ఎలాంటి పరివ‌ర్త‌న‌కు అయినా సిద్ధంగా ఉండాలి అనే ఇంట్రెస్టింగ్ థీమ్‌ని ఇందులో చూపించారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లేదా గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగి భ‌ర్త‌గా రావాల‌ని కోరుకునే ప‌డ‌తులు చూడాల్సిన రియాలిటీ బేసిస్ సినిమా ఇద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.