సీఎం చంద్రబాబు భార్యకు హీరోయిన్ విషెస్.. పెద్దత్త అంటూ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి నేడు (జూన్ 20) పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jun 2025 11:48 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, దివంగత ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి నేడు (జూన్ 20) పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. అదే సమయంలో ఓ హీరోయిన్ కూడా భువనేశ్వరికి విష్ చేశారు.
అది కూడా పెద్దత్తా అంటూ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ సిరి లెళ్ల అలియాస్ శిరీష. హీరో నారా రోహిత్ కు కాబోయే భార్య. అయితే సీఎం చంద్రబాబు సోదరుడు దివంగత రామ్మూర్తి నాయుడు కుమారుడే అన్న విషయం తెలిసిందే. అందుకే సిరికి నారా భువనేశ్వరి అత్త వరుస అవుతారు. పెద్ద అత్తయ్య అవుతారు.
దీంతో భువనేశ్వరికి హ్యాపీ బర్త్ డే పెద్ద అత్తయ్య అంటూ సిరి లెళ్ల పోస్ట్ చేశారు. నారా రోహిత్ తో కొన్ని నెలల క్రితం జరిగిన నిశ్చితార్థ వేడుకలో తనను ఆశీర్వదించిన పిక్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ద అత్తయ్యకు, కాబోయే కోడలికు మధ్య మంచి అనుబంధం ఉన్నట్లుందని కామెంట్లు పెడుతున్నారు.
అది నిజమనే చెప్పాలి. ఎందుకంటే.. రోహిత్, సిరి పెళ్లి సంబంధాన్ని భువనేశ్వరిని ఖరారు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సిరి లెళ్ల స్వగ్రామం ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన దైద. వారి కుటుంబం కొన్నేళ్ల క్రితం దైద నుంచి రెంట చింతలకు వలస వచ్చింది. అయితే హైదరాబాద్ లో ఉన్నత విద్యను అభ్యసించిన సిరి.. ఆస్ట్రేలియాకు వెళ్లారు.
అక్కడ జాబ్ కూడా చేశారు. మోడల్ గానూ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చారు. అప్పుడు ప్రతినిధి-2 ఆడిషన్స్ కు వెళ్లగా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యి నటించారు. డెబ్యూ మూవీ సమయంలో హీరో రోహిత్, సిరి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు.
తమ లవ్ మ్యాటర్ ను భువనేశ్వరికి తెలిపారు నారా రోహిత్. ఆమె చంద్రబాబుకు చెప్పడమే కాకుండా సిరి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించారు. అలా కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో రోహిత్, సిరి ఎంగేజ్మెంట్ సన్నిహితుల మధ్య జరిగింది. ఇప్పుడు డిసెంబర్ లో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో వివాహ తేదీని కుటుంబీకులు ప్రకటించనున్నారు.
