Begin typing your search above and press return to search.

థియేటర్లోనే సైరన్.. ఎప్పుడంటే?

వీరిద్దరు కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:48 PM GMT
థియేటర్లోనే సైరన్.. ఎప్పుడంటే?
X

పొన్నియన్ సెల్వన్ తర్వాత కోలీవుడ్ స్టార్‌ హీరో జయం రవి.. సైరన్ 108 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మహానటి కీర్తి సురేష్, మోస్ట్ పాపులర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా కలిసి ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరు కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.


గతంలో అభిమన్యుడు, విశ్వాసం వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని భాగ్యరాజ్‌ తొలిసారి మెగా ఫోన్ పట్టి సైరన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్‌, టీజర్‌ లకు మంచి స్పందన వచ్చింది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. 2023 డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల అవ్వలేదు.


అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసి డైరెక్ట్‌ గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు కూడా టాక్ వినిపించింది. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న సైరన్‌ సినిమాను స్ట్రీమింగ్ అవుద్దని వస్తున్న వార్తలను తాజాగా చిత్రయూనిట్ ఖండించింది.

సైరన్ మూవీ రిలీజ్ డేట్ ను సోమవారం ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. తమిళం లోనే కాకుండా తెలుగు భాషలో ఈ సినిమా విడుదల కానునట్లు చెప్పారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లింగ్‌ అంశాలతో ఒక రివేంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. టీజర్ లో అంబులెన్స్ డ్రైవర్ అయిన జయం రవి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపించారు. పెరోల్‌ పై విడుదలైన తర్వాత తనని జైలుకు పంపించిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో జ‌యం ర‌వి తొలిసారిగా సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ లో కనిపించనున్నారు.

పోలీస్‌ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్‌ నటించగా.. అనుపమ ఓ కీలక పాత్ర పోషించింది. సముద్రఖని, యోగి బాబు, తులసి, కౌశిక్ మెహతా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. హోమ్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ - అనూష విజయ్ కుమార్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చారు. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి