'సార్ మేడమ్'కు ఏమైంది? తెలుగులో రిలీజ్ అవ్వలేదా?
అయితే సినిమాను జులై 25వ తేదీన తమిళంతో పాటు తెలుగులో సార్ మేడమ్ టైటిల్ తో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 25 July 2025 4:45 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ లీడ్ రోల్స్ లో తలైవన్ తలైవి మూవీ రూపొందిన విషయం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది.
సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఆ సినిమాలో యోగి బాబు, ఆర్కే సురేష్, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, దీప ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అయితే సినిమాను జులై 25వ తేదీన తమిళంతో పాటు తెలుగులో సార్ మేడమ్ టైటిల్ తో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
ట్రైలర్ ప్రకారం.. సినిమాలో విజయ్, నిత్య భార్యాభర్తలుగా కనిపించారు. వారి మధ్య ఫన్నీ సీన్స్ మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ప్రత్యేకించి విజయ్ సేతుపతి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ట్రైలర్ కు ప్రధాన హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.
కానీ ఇప్పుడు తమిళంలో సినిమా రిలీజ్ అయినా.. తెలుగులో ఎలాంటి సందడి కనిపించలేదు. టికెట్స్ కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో మేకర్స్.. తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేసినట్లు కనిపించడం లేదు. అలా అని ప్రకటన కూడా ఇవ్వలేదు. దీంతో ఏం జరిగిందోనని నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు.
అయితే ఇప్పటికే థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉండగా.. అనవసరమైన క్లాష్ ను నివారించడానికే మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే కాస్త ఆలస్యంగా థియేటర్లలో విడుదల చేస్తారేమోనని అంటున్నారు. OTT ప్రీమియర్ ను ప్లాన్ చేస్తుండవచ్చని చెబుతున్నారు.
కానీ ప్రస్తుతానికి నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. తెలుగు సినీ ప్రియులు స్పష్టత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే తెలుగు రిలీజ్ విషయంలో మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.
