Begin typing your search above and press return to search.

సిన్నర్స్ మూవీ సూపరే కానీ...

హాలీవుడ్ మూవీ సిన్నర్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో జోర్డాన్ సహా పలువురు నటించారు.

By:  Tupaki Desk   |   20 April 2025 1:59 PM IST
Sinners Movie: Box Office Success and Critical Acclaim
X

హాలీవుడ్ మూవీ సిన్నర్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో జోర్డాన్ సహా పలువురు నటించారు. తొలిరోజు $19.2 మిలియన్లు సంపాదించింది. ఇప్పటి వరకు $42–$45 మిలియన్ల వసూళ్లు రాబట్టింది. వీకెండ్ లో కూడా మంచి వసూళ్లను సాధించింది.

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద నెం.1 స్థానంలో నిలిచింది సిన్నర్స్. గత పదేళ్లలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వసూళ్లను రాబడుతున్న సిన్నర్స్ మూవీ.. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. దీంతో సినిమా కోసమే ఎక్కడ చూసిన చర్చ జరుగుతోంది.

అయితే సిన్నర్స్ మూవీ.. కూగ్లర్ కెరీర్ లో బెస్ట్ అని అనేక మంది నెటిజన్లు కొనియాడుతున్నారు. రాటెన్ టొమాటోస్‌ పై 98% విమర్శకుల స్కోరు, 96% ప్రేక్షకుల రేటింగ్‌ ను సాధించడం మామూలు విషయం కాదని చెబుతున్నారు. అరుదైన 'A' సినిమా స్కోర్‌ ను పొందడం సూపర్ అని అంటున్నారు.

అదే సమయంలో సిన్నర్స్.. నార్మల్ హారర్ మూవీ కాదని చెబుతున్నారు. థ్రిల్ ఫీలింగ్ కావాలనుకునేవారికి సెట్ అవ్వదని అంటున్నారు. నార్మల్ హారర్ అంశాల కన్నా మెడిటేటివ్ కల్చర్ డ్రామానే మూవీలో ఎక్కువ ఉందని చెబుతున్నారు. సినిమా చూస్తున్నంతసేపు.. మధ్య డివైడైడ్ ఫీలింగ్ అనిపిస్తుందని అంటున్నారు.

అందుకే మూవీ బాగుంది కానీ.. అందరికీ కాదని చెబుతున్నారు. మెయిన్ గా ఇండియన్ మూవీ లవర్స్ అందరికీ నచ్చదని అభిప్రాయపడుతున్నారు. విజువల్స్ పరంగా సిన్నర్స్ మూవీ ఒక అద్భుతమని అంటున్నారు. నిజానికి.. ఆ మూవీ పూర్తిగా 70 MM, ఐమ్యాక్స్, అల్ట్రా పనావిజన్ ఫార్మాట్లలో షూటింగ్ చేసిన విషయం తెలిసిందే.

ఏదేమైనా సిన్నర్స్ మూవీ.. మంచి సినిమాటిక్ యూనివర్స్ అందిస్తుందని, కూగ్లర్ టాలెంట్ క్లియర్ గా చెబుతుందని అంటున్నారు. లుడ్విగ్ గోరాన్సన్ మ్యూజిక్ ముఖ్యపాత్ర పోషించిందని చెబుతున్నారు. భయానకమైన అనుభూతిని కలిగిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సిన్నర్ మూవీ.. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే సినిమా!