Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు సింగిల్ 2 కథ ఏంటో..?

ఇక ఫైనల్ గా ఒంటరివాడిని నేను అంటూ రేడియో పట్టుకుని వెళ్తుంటాడు హీరో. ఐతే అక్కడే సింగిల్ 2 అనే పోస్టర్ వేస్తాడు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 2:30 AM
శ్రీవిష్ణు సింగిల్ 2 కథ ఏంటో..?
X

శ్రీవిష్ణు లీడ్ రోల్ లో కార్తీక్ రాజు డైరెక్షన్ లో వచ్చిన సినిమా సింగిల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా దాదాపు లీడ్ రోల్ లానే కనిపించాడు. సినిమా అంతా కూడా ఫన్ రైడ్ గా ఆడియన్స్ ని ఫుల్ గా నవ్వించింది. కెతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించిన సింగిల్ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఐతే ఈ సినిమా ఎండింగ్ లో సింగిల్ 2 అంటూ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. అంటే కార్తీక్ రాజు, శ్రీవిష్ణు కలిసి సింగిల్ 2 కూడా చేసే ప్లానింగ్ లో ఉన్నారని అర్థమవుతుంది.

ఐతే సింగిల్ సినిమా స్టోరీ అంతా ఫన్ ఫిల్డ్ గా ఎంటర్టైంగ్ తో సాగింది. సినిమాలో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయాలని హీరో ఓ పక్క ప్రయత్నిస్తే మరో హీరోయిన్ హీరోని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. ఇలా ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరో ఈ ట్రియాంగిల్ లవ్ స్టోరీ సాగుతూ చివర్లో తనను ప్రేమించే హీరోయిన్ హీరోకు బాగా తెలిసిన వాళ్ల జీవితాలని తెలిసి అక్కడ ఆగిపోతాడు. ఐతే ఫైనల్ గా హీరోని సింగిల్ చేయాలి టైటిల్ కి జస్టిఫికేషన్ ఉండాలి కాబట్టి ప్రేమికులు ఇద్దరిని కూడా ఎవరి దారి వారు చూసుకునేలా చేశాడు దర్శకుడు.

ఇక ఫైనల్ గా ఒంటరివాడిని నేను అంటూ రేడియో పట్టుకుని వెళ్తుంటాడు హీరో. ఐతే అక్కడే సింగిల్ 2 అనే పోస్టర్ వేస్తాడు. ఐతే ఇది వేయడానికి ఆల్రెడీ దీనికి కొనసాగింపుగా కథ రాసుకుని ఉండాలి లేదా కనీసం ఒక ఐడియా అయినా ఉంటుందని చెప్పొచ్చు. ఇంతకీ సింగిల్ 2 ఎలా ఉంటుంది. సింగిల్ 2 తోనే ఆపుతాడా లేదా 3,4 ఇలా ఫ్రాంచైజీలు తీస్తాడా అన్నది చూడాలి.

శ్రీవిష్ణు మార్క్ ఎంటర్టైన్మెంట్ తో అతనికి ఉన్న కంటెంట్ కింగ్ అనే ట్యాగ్ లైన్ కి న్యాయం చేస్తూ వచ్చిన సింగిల్ సక్సెస్ అయ్యింది. ఐతే శ్రీవిష్ణు వెంటనే సింగిల్ 2 చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆల్రెడీ కమిటైన సినిమాలు చేస్తాడు కాబట్టి సింగిల్ 2 కి టైం తీసుకున్నా ఈసారి మరింత ఫన్ మరింత ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూస్తారని చెప్పొచ్చు. కార్తీక్ రాజు కూడా అదే ప్రయత్నం చేస్తాడని చెప్పొచ్చు. సో సింగిల్ 2 లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చే అవకాశం ఉంది.