Begin typing your search above and press return to search.

విలన్ అవతారమెత్తిన హీరో.. ఇలాగైనా హిట్టు కొడతాడా?

బాలీవుడ్ లో 'సింగం' ఫ్రాంచైజీలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో ''సింగం ఎగైన్'' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Feb 2024 7:59 AM GMT
విలన్ అవతారమెత్తిన హీరో.. ఇలాగైనా హిట్టు కొడతాడా?
X

సినిమాల్లో హీరోయిజం పండాలంటే హీరోని ఢీకొట్టే స్ట్రాంగ్ విలన్ కూడా ఉండాలి. అందుకే కథానాయకుడి పాత్రకు ధీటుగా ప్రతినాయకుడి పాత్రను కూడా క్రియేట్ చేస్తుంటారు. హీరోతో సమానంగా, లేదా దాన్ని డామినేట్ చేసేలా క్యారెక్టర్స్ ఉంటున్నాయి కాబట్టి, స్టార్ యాక్టర్స్ సైతం విలన్స్ గా నటించాడని ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయంలో మిగతా వారి కంటే బాలీవుడ్ స్టార్స్ కాస్త ముందున్నారు. ఇప్పటికే అనేకమంది హిందీ నటులు విలన్ పాత్రల్లో నటిస్తుండగా.. ఇప్పుడు లేటెస్టుగా అర్జున్ కపూర్ కూడా ఈ లిస్టులో జాయిన్ అయిపోయాడు.


బాలీవుడ్ లో 'సింగం' ఫ్రాంచైజీలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో ''సింగం ఎగైన్'' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాప్ యూనివర్స్ లో భాగంగా డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ తో పాటుగా కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకునే, టైగర్ ష్రాఫ్ వంటి పాపులర్ స్టార్స్ నటిస్తున్నారు. అయితే ఇందులో అర్జున్ కపూర్ కూడా నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు.


"సింగం ఎగైన్'' సినిమాలో మెయిన్ విలన్ గా అర్జున్ కపూర్ కనిపించనున్నారు. ఇప్పటికే లీడ్ యాక్టర్స్ అందరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన రోహిత్ శెట్టి.. ఇప్పుడు అర్జున్ పాత్రకు సంబంధించిన రెండు పోస్టర్లను విడుదల చేశారు. ''మనిషి తప్పు చేస్తాడు.. ఆ తప్పుకి శిక్ష కూడా అనుభవిస్తాడు.. కానీ ఇప్పుడు రాబోతోంది సైతాన్" అంటూ అతని పాత్రను పరిచయం చేశారు.

ఒక పోస్టర్ లో అర్జున్ కపూర్ రక్తసిక్తమైన ఫేస్ తో చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు. రక్తంలో తడిసిన పెద్ద కత్తి పట్టుకొని క్రూరంగా నవ్వుతున్నాడు. ఉంగరాల జుట్టు, గుబురు గడ్డం, కోర మీసాలతో భయంకరమైన లుక్ లో ఆకట్టుకున్నాడు. మరో ఫోటోలో రణ్వీర్ సింగ్ - అర్జున్ కపూర్ ఇద్దరూ ఒకరనొకరు ఎదురెదురుగా నిలబడి ఇంటెన్స్ గా చూస్తూ కనిపించారు. ఇది చూస్తుంటే రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో అర్జున్ మెయిన్ విలన్ గా ఉంటారేమో అనిపిస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుమారుడైన అర్జున్ కపూర్.. 2012లో 'ఇషాక్ జాదే' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఔరంగజేబ్, గుండే, 2 స్టేట్స్, తేవర్, కి & కా, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, ఏక్ విలన్ రిటర్న్స్, కుత్తే వంటి చిత్రాల్లో నటించాడు. ఇవేవీ కూడా అతన్ని స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. అయితే సినిమాతో కంటే తనకంటే పెద్దదైన 50 ఏళ్ల మలైకా అరోరాతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. చాలా కాలంగా సక్సెస్ కు దూరమైన ఈ హీరో.. 'సింగం అగైన్' తో విలన్ అవతారమెత్తుతున్నాడు.

ఇప్పటికే జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మీ, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, వివేక్ ఒబెరాయ్, సునీల్ శెట్టి లాంటి బాలీవుడ్ స్టార్స్ విలన్స్ గానూ రాణిస్తున్నారు. వీరిలో కొందరు తెలుగులోనూ ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు అర్జున్ కపూర్ కూడా 'సింగం అగైన్' మూవీతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడేమో వేచి చూడాలి.