Begin typing your search above and press return to search.

పుష్ప 2.. వెయ్యి కోట్ల ఆశకు సింగం ముప్పు!

అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   2 April 2024 11:30 PM GMT
పుష్ప 2.. వెయ్యి కోట్ల ఆశకు సింగం ముప్పు!
X

అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈపాటికే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసేదేమో. కానీ సుకుమార్ పర్ఫెక్షన్ ప్లానింగ్ తో సినిమాను ఆలస్యం చేస్తున్నాడు. మొత్తానికి ఆగస్టు 15వ తేదీన కచ్చితంగా విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. ఏలాంటి పోస్టర్ రిలీజ్ చేసిన కూడా అందులో రిలీజ్ పోస్టర్ ను ప్రత్యేకంగా హైలైట్ చేస్తోంది.

కాబట్టి సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం లేదని ఫ్యాన్స్ ఒక నమ్మకంతో కనిపిస్తూ ఉన్నారు. అయితే పుష్ప 2 సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద తప్పకుండా వెయ్యి కోట్ల మార్క్ ను అందుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా అల్లు అర్జున్ సుకుమార్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకడకుండా సినిమాను నిర్మిస్తోంది. ప్రమోషన్స్ విషయంలో కూడా అసలు తగ్గడం లేదు.

ఇక ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్టర్ ద్వారా అయినా సరే సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. అయితే సినిమా 1000 కోట్ల మార్క్ ను అందుకోవాలి అంటే పోటీగా పెద్ద సినిమాలు ఏమీ రాకూడదు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ లో ఒక గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని అర్థమవుతుంది. అజయ్ దేవగన్ సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న సింగం ఎగైన్ ప్రాజెక్టు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.

అయితే ఈ సినిమాకు డైరెక్టర్ శెట్టి అని అతను పాత మసాలా కామెడీ ఈసారి వర్కౌట్ కాదు అనేలా కూడా కామెంట్స్ చాలానే వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టును అంత తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అజయ్ దేవగన్ రోహిత్ శెట్టితో ఇప్పటికే 10 సినిమాలు చేశాడు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన గోల్ మాల్ ఫ్రాంచైజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.

ఇక సింగం సిరీస్ లు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. అంతేకాకుండా అజయ్ దేవగన్ టైమ్ కూడా ఇప్పుడు బాగానే నడుస్తోంది. రీసెంట్ గా నటించిన సైతాన్ సినిమా కాస్త ఫ్లాప్ టాక్ అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కాబట్టి ఈ సింగం కాంబినేషన్ ను తక్కువంచనా వేయడానికి వీలులేదు. ఖచ్చితంగా బాలీవుడ్ లో క్లిక్ అయితేనే పుష్ప 2 సినిమా 1000 కోట్ల మార్కెట్ ను రీచ్ అవుతుంది. కాబట్టి పోటీలో బలంగా నిలవాలి అంటే ప్రమోషన్స్ కూడా అంతకుమించి అనేలా ఉండాలి. అప్డేట్స్ కూడా ఓపెనింగ్స్ కు ఉపయోగపడాలి. మరి ఆ దిశగా పుష్ప 2 సింగం కాంబినేషన్ కు పోటీని ఇస్తుందో లేదో చూడాలి.