Begin typing your search above and press return to search.

ప్లాప్ టాక్ తో 'పుష్ప‌-2' ఫ్యాన్స్ దిల్ ఖుష్‌!

అయితే ఈ సినిమాకి పోటీగా హిందీలో రోహిత్ శెట్టి కాప్ యూనివ‌ర్శ‌న్ నుంచి 'సింగం ఎగైన్' కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా భారీ కాన్సాస్ పై తెర‌కెక్కుతోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:17 AM GMT
ప్లాప్ టాక్ తో పుష్ప‌-2 ఫ్యాన్స్ దిల్ ఖుష్‌!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న 'పుష్ప‌-2' ఎలాంటి అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. మొద‌టి భాగం భారీ విజ‌యం సాధించ‌డంతో రెండ‌వ భాగంపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. మ‌రోసారి పాన్ ఇండియాని పుష్ప‌-2 వ‌సూళ్ల‌తో షేక్ చ‌య‌డం ఖాయ‌మ‌ని అంతా భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే చిత్రాన్ని ద‌ర్శ‌కుడు సుకుమార్ శిల్పంలా చెక్కుతు న్నాడు.

ఇప్ప‌టికే 'పుష్ప‌-2'ని స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. షూటింగ్ కూడా అనుకున్న స‌మయానికి పూర్త‌య్యే సంకేతాలు క‌నిపిస్తోన్న నేప‌థ్యంలో వాయిదా ప‌డే అవ‌కాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి పోటీగా హిందీలో రోహిత్ శెట్టి కాప్ యూనివ‌ర్శ‌న్ నుంచి 'సింగం ఎగైన్' కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా భారీ కాన్సాస్ పై తెర‌కెక్కుతోంది.

అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టిస్తుండ‌గా అక్ష‌య్ కుమార్..టైగ‌ర్ ష్రాప్..ర‌ణ‌వీర్ సింగ్ లాంటి స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రీనా కపూర్ దీపికా ప‌దుకొణే.. క‌త్రినా కైఫ్ లాంటి సీనియ‌ర్ భామ‌లు భాగమ వుతోన్న చిత్ర‌మిది. హిట్ ప్రాంచైజీ స‌హా ఇంత పెద్ద భారీ తారాగ‌ణం ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు ప‌తాక స్థాయిలో ఉన్నాయి. దీంతో సింగం ఎగైన్ నార్త్ స‌హా చాలా చోట్ల పుష్ప‌-2కి గ‌ట్టిగా క‌నిపిస్తుంది.

ఇది 'పుష్ప‌-2' టీమ్ లో సైతం వ‌ణుకు పుట్టించే విష‌య‌మే. ఎందుకంటే హిట్ టాక్ తెచ్చుకుంటే గ‌నుక నార్త్ వ‌సూళ్ల‌పై ఈ సినిమా తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప2 అన్నిచోట్ల కంటే నార్త్ బెల్డ్ లో భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ వెన‌క్కి త‌గ్గాలి అనుకుంటే 'పుష్ప‌-2' ని వాయిదా వేయాలి త‌ప్ప‌! సింగం ఎగైన్ మాత్రం వాయిదా వేసే ఛాన్స్ లేదు.

అయితే ఇక్క‌డో విష‌యం పుష్ప‌-2 ని ఉత్సాహ‌ప‌రుస్తుంది. ఇటీవ‌లే రోహిత్ శెట్టి కాప్ యూనివ‌ర్శ్ నుంచి రిలీజ్ అయిన వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' ఆశించిన స్థాయిలో రీచ్ అవ్వ‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈ సిరీస్ వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ నేప‌థ్యంలో ఈ నెగిటివిటీ సింగం ఎగైన్ పై ప‌డుతుంది.