Begin typing your search above and press return to search.

అక్షయ్ ఫస్ట్ లుక్ పై ఇలాంటి కామెంట్స్ ఏల..?

అనౌన్స్ మెంట్ తో పాటుగా సినిమా నుంచి అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంతేకాదు సినిమాను 2024 ఆగష్టు 15న రిలీజ్ డేట్ లాక్ చేశారు. సింగం అగైన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 4:33 PM GMT
అక్షయ్ ఫస్ట్ లుక్ పై ఇలాంటి కామెంట్స్ ఏల..?
X

బాలీవుడ్ యాక్షన్ స్టార్ అజయ్ దేవగన్ లీడ్ రోల్ లో రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సినిమా అంటే బాలీవుడ్ ఆడియన్స్ కి పండుగ అన్నట్టే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. కామెడీ యాక్షన్ ఇలా వాళ్లిద్దరు కలిసి ఏ సినిమా చేసినా ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. సక్సెస్ ఫుల్ హీరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఈ కాంబో సినిమా అంటే బీ టౌన్ ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.


ఈ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా సింగం అగైన్. సింగం ఫ్రాంచైజీ లో భాగంగా ఈ సినిమా వస్తుంది. ఆల్రెడీ సింగం నుంచి రెండు పార్ట్ లు ఆడియన్స్ ని అలరించాయి. ఆ రెండు సినిమాల హిట్ తో సింగం మూడో పార్ట్ కోసం వెయిట్ చేశారు. సింగం అగైన్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ తో పాటుగా సినిమా నుంచి అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంతేకాదు సినిమాను 2024 ఆగష్టు 15న రిలీజ్ డేట్ లాక్ చేశారు. సింగం అగైన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటుగా అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్నారు. హీరోయిన్స్ విషయానికి వస్తే దీపికా పదుకొనె, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో అతి పెద్ద సినిమాగా ఇది వస్తుంది. సింగం సాబ్ ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేయగా ఈ లుక్ చూసిన కొందరు అఫీషియల్ లుక్ కాదు ఏదో ఫ్యాన్ మేడ్ పోస్టర్ లానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే సింగం రోర్ వింటారు అంటూ సింగం అగైన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో సింహం, అజయ్ దేవగన్ ఫేస్ ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే ఫ్యాన్ మేడ్ కన్నా తక్కువ క్వాలిటీతో చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత భారీ సినిమా పోస్టర్ విషయంలో మేకర్స్ ఎందుకు ఇలా చేశారంటూ బాలీవుడ్ ఆడియన్స్ డిస్కస్ చేస్తున్నారు. పోస్టర్ లానే సినిమా కూడా ఉంటుందా ఏంటని కూడా చెప్పుకుంటున్నారు. సింగం అగైన్ పోస్టర్ పై వస్తున్న ఈ కామెంట్స్ పై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.