Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోయిన్‌ కొడుకులను చూశారా...!

సిమ్రాన్ 2000 సంవత్సరం కాలంలో టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2023 8:22 AM GMT
సీనియర్ హీరోయిన్‌ కొడుకులను చూశారా...!
X

సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవ లేదు. ఇప్పటికే చాలా మంది హీరోల మరియు హీరోయిన్స్ ఇతర టెక్నీషియన్స్‌ యొక్క వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. త్వరలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ యొక్క నట వారసులు కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజా ఫోటోలు చూసిన వారు అంటున్నారు.


సిమ్రాన్ 2000 సంవత్సరం కాలంలో టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున ఇలా అందరు సీనియర్‌ హీరోలతో పాటు మహేష్ బాబు వంటి యంగ్‌ హీరోలతో కూడా అప్పట్లో నటించి సెన్షేషన్ క్రియేట్ చేసింది.

అందం విషయంలో సిమ్రాన్ ను అప్పట్లో ప్రత్యేకంగా అభిమానులు మాట్లాడుకుంటూ ఉండేవారు. అంతటి అందమైన సిమ్రాన్ ఇంకా కూడా అదే అందంతో ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. త్వరలోనే సిమ్రాన్‌ తన వారసులుగా ఇద్దరు కొడుకులను హీరోలుగా పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా సిమ్రాన్ తన కుటుంబ సభ్యులతో క్రిస్మస్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో సిమ్రాన్ కొడుకులు చాలా పెద్ద వారు అయినట్లుగా కనిపిస్తున్నారు. అంతే కాకుండా వారిని చూస్తూ ఉంటే ఫక్త్‌ బాలీవుడ్‌ యంగ్‌ హీరోల మాదిరిగా ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సిమ్రాన్ మరియు ఆమె భర్తకు ఆసక్తి ఉంటే ఇప్పుడే వారిని తమ సినిమాల్లో నటింపజేసేందుకు రెడీ అన్నట్లుగా కొందరు ఫిల్మ్‌ మేకర్స్ కూడా రెడీ గా ఉన్నారు అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సిమ్రాన్ యొక్క అందం కు తగ్గట్లుగా ఆమె కొడుకులు కూడా ఉన్నారు. వారు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తే తెలుగు లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంటారేమో చూడాలి.