Begin typing your search above and press return to search.

ఆ పాప హీరోయిన్..ఇంత హాట్ గానా?

సిమ్ర‌న్ చ‌బ్బీ లుక్ లో క‌నిపిస్తుంది. టైట్ ఫిట్ దుస్తుల్లో సోఫాలో కూర్చుని ఉన్న ఫోటో ఒక‌టి వైర‌ల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   4 Aug 2023 10:13 AM GMT
ఆ పాప హీరోయిన్..ఇంత హాట్ గానా?
X

''ఈ న‌గ‌రానికి ఏమైంది..ఓవైపు పొగ‌.. మ‌రోవైపు నుసి..ఎవ‌రూ నోరు మొద‌ప‌రేంటి'' అంటూ సినిమా ప్రారంభానికి మందు...విరామం స‌మ‌యంలో ఓ ప‌బ్లిక్ యాడ్ ప్ర‌సార‌మ‌వుతుంది. వ్య‌స‌నాల‌కు బానిసైతే ఆరోగ్యం ఎలా క్షీణిస్తుంది? కుటుంబం ఎలా ఇబ్బంది ప‌డుతుంద‌న్న‌ది అందులో చూపించారు. ఈ యాడ్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ యాడ్ లో తండ్రిని చూసి ఓ చిన్న పాప దీనంగా క‌నిపిస్తుంది. ఆ పాప పేరు సిమ్రాన్ న‌టేక‌ర్. ఇప్పుడీ పాప పెరిగి పెద్ద‌దైపోయింది.

ఈ యాడ్ ద్వారా దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది సిమ్ర‌న్. ఆ యాడ్ త‌ర్వాత 150కి పైగా యాడ్స్ చేసింది. అటుపై చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లోనూ న‌టించింది. అలాగే క్రిష్‌-3.. జానే క‌హాన్ సే అయి హై చిత్రంలోనూ మెప్పించింది.

1997 లో ముంబైలో జ‌న్మించిన సిమ్ర‌న్ ఇప్పుడు హీరోయిన్ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉంది. త‌న ట్యాలెంట్ ని గుర్తించి ఎవ‌రైనా అవ‌కాశం క‌ల్పిస్తారా? అని ఎదురుచూస్తుంది. ట్విట‌ర్ లో అమ్మ‌డు కొన్ని హాట్ హాట్ ఫోటోలు కూడా వ‌దిలింది.

సిమ్ర‌న్ చ‌బ్బీ లుక్ లో క‌నిపిస్తుంది. టైట్ ఫిట్ దుస్తుల్లో సోఫాలో కూర్చుని ఉన్న ఫోటో ఒక‌టి వైర‌ల్ అవుతుంది. మ‌రో రెండు ఫోటోల్లో మాత్రం అమ్మ‌డు క్యూట్ లుక్స్ లో ఆక‌ట్టుకుంటుంది. చూడ‌టానికి హీరోయిన్ మెటీరియల్ లాగే క‌నిపిస్తుంది. మరీ ఈ బ్యాటీకి అవ‌కాశాలు వ‌రిస్తాయో లేదో? చూడాలి. చిన్న వ‌య‌సులో ఓ బాధ్య‌త‌గ‌ల యాడ్ లో న‌టించింది. స‌మాజానికి త‌న ద్వారా ఓ సందేశాన్ని పాస్ చేసింది.

ఇలాంటి బ్యూటీని ప్రోత్స‌హించాల్సిన బాద్య‌త సినిమా వాళ్ల‌పై ఉంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వార‌సురాళ్ల హ‌వా కొన‌సాగుతుంది. జాన్వీక‌పూర్..సారీ అలీఖాన్..అన‌న్యా పాండే లాంటి భామ‌లు వార‌సత్వంతో దూసుకు పోతున్నారు.

వాళ్ల కార‌ణంగా కొత్త భామ‌ల‌కి అవ‌కాశాలు క‌ష్టంగానే మారాయి. సీనియ‌ర్ నాయిక‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ..ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చే వారికి మాత్రం అవ‌కాశాలు క‌ష్టంగానే మారాయి.