Begin typing your search above and press return to search.

సిమ్రాన్ టోయోటా ఫార్చ్యూన‌ర్ సారీలో న‌డుపుతుంటే!

అమ్మ‌డి సొగ‌సైన డ్రైవింగ్ చూస్తే ఎవ‌రైనా? సిమ్రాన్ తో క‌లిసి ఒక్క‌సారైన ప‌క్క సీట్ షేర్ చేసుకో వాల‌నిపిస్తుంది. డ్రైవింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది మ‌రి.

By:  Tupaki Desk   |   4 Feb 2024 9:27 AM GMT
సిమ్రాన్ టోయోటా ఫార్చ్యూన‌ర్ సారీలో న‌డుపుతుంటే!
X

టాలీవుడ్ హాట్ బ్యూటీ సిమ్రాన్ చౌద‌రి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డి హాట్ అందాల‌కి కుర్రాళ్లు ఎప్పుడో ఫిదా అయ్యారు. ఇన్ స్టా వేదిక‌గా అమ్మ‌డు ఓ పోస్ట్ చేసిందంటే వాయు వేగంతో దూసుకుపోతుంది. పైగా తెలుగు అమ్మాయి కావ‌డంతో మ‌రింత పాపుల‌ర్ అవుతుంది. 'హ‌మ్ తుమ్' తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన బ్యూటీ గ‌తేడాది 'అధర్వ' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌ధ్య‌లో నాలుగైదు సినిమాలు చేసింది. కానీ ఏవీ సిమ్రాన్ ని బిజీ నాయిక‌గా మార్చ‌లేక‌పోయాయి. ఏడేళ్ల‌గా సినిమాలైతే చేస్తుందు గానీ న‌టిగా మాత్రం ఇంకా మెయిన్ లీగ్ లో చేర‌లేదు. కానీ ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌లేదు. సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం అభిమానుల‌కు రెగ్యుల‌ర్ గా ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట‌యోటో పార్చ్యూన‌ర్ డ్రైవ్ చేస్తోన్న ఓవీడియోని పోస్ట్ చేసింది.

అమ్మ‌డి సొగ‌సైన డ్రైవింగ్ చూస్తే ఎవ‌రైనా? సిమ్రాన్ తో క‌లిసి ఒక్క‌సారైన ప‌క్క సీట్ షేర్ చేసుకో వాల‌నిపిస్తుంది. డ్రైవింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది మ‌రి. అమ్మ‌డు స్టీరింగ్ ని సీనియ‌ర్ డ్రైవ‌ర్ రేంజ్ లో సింగి ల్ హ్యాండ్ తోనే తిప్పేస్తుంది. స్ట్రెయిట్ రోడ్డు అయినా....ట‌ర్నింగ్ లున్నా ఓన్లీ సింగిల్ హ్యాండ్ అంటూ దూసుకుపోతుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో కెమెరా వైపు చూస్తూ క‌వ్వింపులు.

అంద‌మైన పెదాలతో ఓ న‌వ్వు విసిరి కుర్రాళ్లంతా ఓసారి ఇటు చూడండి అనేస్తుంది. అన్నింటిని మించి అమ్మ‌డు సారీలో కారు డ్రైవ్ చేయ‌డం సంథింగ్ స్పెష‌ల్ అనాలి. చీర‌లో డ్రైవింగ్ అసౌక‌ర్యంగా ఉంటుం దంటారు. కానీ సిమ్రాన్ డ్రైవింగ్ చూస్తుంటే చీర‌లో ఎంతో సౌక‌ర్యంగా ఉంది అనిపించేలా డ్రైవ్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. సిమ్రాన్ అభిమానులు సొగ‌సైన కామెంట్ల‌తో హీటెక్కి స్తున్నారు.