Begin typing your search above and press return to search.

సిమ్రాన్‌ Vs జ్యోతిక.. అసలు జరిగింది ఏంటంటే!

సిమ్రాన్‌ వ్యాఖ్యల వల్ల మొదలైన వివాదం కాస్త ముదిరింది. తన వ్యాఖ్యల గురించి స్పందించేందుకు మరోసారి సిమ్రాన్ మీడియా ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   27 April 2025 6:45 AM
సిమ్రాన్‌ Vs జ్యోతిక.. అసలు జరిగింది ఏంటంటే!
X

సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ ఇటీవల ఒక అవార్డ్‌ వేడుకలో మాట్లాడుతూ ఆంటీ తరహా పాత్రలు చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ముఖ్యమైన పాత్రల్లో నటించాలని అనుకోవడం లేదని, సినిమాలో మూడు నాలుగు సీన్స్‌లో కనిపించే డబ్బా పాత్రను చేయాలని అనుకోవడం లేదు అంటూ సిమ్రాన్‌ చెప్పుకొచ్చింది. తనకు వస్తున్న ఆఫర్ల విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. సిమ్రాన్ ఏ ఉద్దేశంతో అన్నదో కానీ ఆ విషయం ప్రస్తుతం రాద్దాంతాన్ని క్రియేట్‌ చేసింది. సిమ్రాన్‌ చేసిన వ్యాఖ్యలు మరో సీనియర్ హీరోయిన్‌ జ్యోతిక గురించి అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. జ్యోతిక ఈ మధ్య కాలంలో ఎక్కువ డబ్బా పాత్రలు చేస్తుంది అనే విమర్శలు ఎదుర్కొంటుంది.

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల వచ్చిన ఒక సినిమాలో జ్యోతిక పోషించిన పాత్రకు అసలు ప్రాముఖ్యత లేదని, అలాంటి పాత్రలను ఎలా ఒప్పుకుంటుంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ వయసులో డబ్బా పాత్రలు చేయాల్సిన అవసరం ఏంటి అంటూ చాలా మంది ట్రోల్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను సిమ్రాన్‌ చేయడంతో జ్యోతిక అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. సిమ్రాన్ వ్యాఖ్యలపై జ్యోతిక నేరుగా స్పందించకున్నా ఆమె అసహనం వ్యక్తం చేసిందనే వార్తలు వస్తున్నాయి. సిమ్రాన్‌తో జ్యోతిక మాట్లాడిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

సిమ్రాన్‌ వ్యాఖ్యల వల్ల మొదలైన వివాదం కాస్త ముదిరింది. తన వ్యాఖ్యల గురించి స్పందించేందుకు మరోసారి సిమ్రాన్ మీడియా ముందుకు వచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ సిమ్రాన్‌ మాట్లాడుతూ... తాను ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు. తాను ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడాను. అయినా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఇద్దరు హీరోయిన్స్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం నేను చూడలేదు. ఇండస్ట్రీకి చెందిన వారు హీరోయిన్స్ మధ్య సఖ్యత ఉండనివ్వరు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇద్దరు నటీమణుల మధ్య స్నేహం ఎప్పుడూ ఎక్కువ కాలం ఉండదని, ఆ విషయం మరోసారి నిరూపితం అయిందని చెప్పుకొచ్చింది.

జ్యోతిక ఈ విషయం గురించి బాహాటంగా స్పందించలేదు, కానీ ఆమె అభిమానులు మాత్రం ఈ విషయమై సిమ్రాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. మనం చేసే పని మీద మనం నమ్మకం ఉంచాలి, ఏ పనిని విమర్శించడం, తక్కువ చేయడం తగదు అంటూ సిమ్రాన్‌కు పలువురు సూచిస్తూ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్‌ చేస్తున్నారు. ముందు ముందు అయినా ఆమె కాస్త నోరు హద్దులో పెట్టుకోవాలి అంటూ జ్యోతిక అభిమానులు సున్నితంగా వార్నింగ్‌ ఇస్తున్నారు. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన సిమ్రాన్ మరోసారి ఈ వివాదం గురించి స్పందించేనా, జ్యోతిక అభిమానులు చేస్తున్న ట్రోల్స్‌కి సిమ్రాన్‌ స్పందిస్తుందా అనేది చూడాలి.