Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ మధ్య గొడవ క్లీయర్‌...!

తాజాగా సిమ్రాన్ నటించిన టూరిస్ట్‌ ఫ్యామిలీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   22 May 2025 11:03 AM IST
హీరోయిన్స్ మధ్య గొడవ క్లీయర్‌...!
X

సీనియర్ హీరోయిన్స్ సిమ్రాన్‌, జ్యోతిక మధ్య కోల్డ్‌ వార్‌ అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. సిమ్రాన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా జ్యోతిక బాగా హర్ట్‌ అయిందని, దాంతో ఆమె కూడా తీవ్ర పదజాలంతో పేరు ప్రస్థావించకుండా కౌంటర్‌ ఇచ్చిందని, ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతోంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. మూడు నాలుగు వారాలుగా వీరి గురించి తమిళ మీడియాతో పాటు తెలుగు మీడియాలోనే వార్త కథనాలు వస్తున్న నేపథ్యంలో అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తాజాగా సిమ్రాన్ నటించిన టూరిస్ట్‌ ఫ్యామిలీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సక్సెస్‌ జోష్ లో ఉన్న సిమ్రాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవార్డ్‌ వేడుకలో మరో హీరోయిన్‌ను డబ్బా క్యారెక్టర్స్ చేస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదని సిమ్రాన్‌ పేర్కొంది. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, ఆమె సైతం స్పందించిన తీరు క్షమాపణలు చెప్పిందని సిమ్రాన్ పేర్కొంది. క్షమించమని మెసేజ్‌ చేయడం ద్వారా మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని సిమ్రాన్ తెలియజేసింది.

డబ్బా కార్టెల్‌ వెబ్‌ సిరీస్‌లో జ్యోతిక పాత్ర విషయమై సిమ్రాన్‌ అవమానకరంగా మాట్లాడింది అంటూ వివాదం మొదలు అయింది. అమ్మ పాత్రల్లో నటించినా పర్వాలేదు కానీ డబ్బా పాత్రల్లో నటించడం అనేది అస్సలు ఇష్టం లేదని సిమ్రాన్‌ వ్యాఖ్యలు చేయడంతో అసలు వివాదం మొదలు అయింది. జ్యోతిక అభిమానులు ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు. చివరకు జ్యోతిక కూడా స్పందించడం ద్వారా వివాదం మరింత ముదిరింది. సిమ్రాన్‌, జ్యోతిక మధ్య వివాదం మెల్ల మెల్లగా రాజుకుంటుంది అనుకుంటున్న సమయంలో ఇద్దరూ కూడా తెర వెనుక మాట్లాడుకుని వివాదం లేకుండా చూసుకున్నట్లుగా సిమ్రాన్ మాటలను బట్టి అర్థం అవుతుంది.

సాధారణంగానే హీరోయిన్స్ మధ్య వివాదాలు అనేవి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అయితే యంగ్‌ హీరోయిన్స్ మధ్య కెరీర్‌లో పోటీ నేపథ్యంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇలా సీనియర్‌ హీరోయిన్స్ మధ్య మాటా మాటా పెరగడం అనేది విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అభిమానుల పేరుతో కొందరు చేసిన అతి కారణంగా వీరి మధ్య గొడవ అనేది మరింత పెద్దగా మారింది. సిమ్రాన్‌ తాజా వ్యాఖ్యలతో జ్యోతిక క్షమాపణలు చెప్పిందని, ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం లేదని క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటి వరకు జ్యోతిక మాత్రం ఈ విషయమై, రాజీ గురించి పెద్దగా నోరు విప్పడం లేదు.