డబ్బా రోల్ అంటూ సహనటిపై సిమ్రన్ పంచ్
సీనియర్ నటి సిమ్రన్ ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూ రీఎంట్రీలో బిజీ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 April 2025 8:48 AMసీనియర్ నటి సిమ్రన్ ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూ రీఎంట్రీలో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో విలక్షణమైన నటనతో అతిథి పాత్రకు అందం తెచ్చింది. సిమ్రన్ నటనకు ప్రశంసలు కురిసాయి. ఇంతకుముందు అంధగన్ లోను తన ప్రతినాయక పాత్రతో ఆకట్టుకుంది. ఇప్పుడు అంధగన్ సినిమాలోని నటనకు గాను ఒక ప్రయివేట్ పురస్కారాన్ని సిమ్రన్ అందుకుంది. అయితే అవార్డుల వేడుకలో సిమ్రన్ చేసిన ఓ కామెంట్ కి సంబంధించిన క్లిప్ క్షణాల్లో వెబ్‌లో వైరల్ అయింది.
ఈ క్లిప్ లో సిమ్రన్ ఇటీవలే తన సహనటి నటనను ప్రశంసించానని తెలిపారు. అలాంటి పాత్రలో తనను చూసాక ఆశ్చర్యపోయానని తనతో సిమ్రన్ అన్నారట. దానికి స్పందించిన ఆ నటి ``అంటీ పాత్రలు చేయడం కంటే ఇది మంచిది`` అని చెప్పింది. అప్పుడు సిమ్రాన్ స్పందించలేదు కానీ ఆమె ప్రసంగం సమయంలో ``అంటీ పాత్రలు చేయడం సరైందే .. డబ్బా పాత్రలు చేయడం కంటే, 25 ఏళ్ల అబ్బాయికి తల్లిగా నటించడం మంచిది`` అని ఈ వేదికపై చెప్పింది.
అయితే సిమ్రన్ డబ్బా కామెంట్ ఎవరిపై? అంటూ ఆరాలు మొదలయ్యాయి. డబ్బా కార్టెల్ (నెట్ ఫ్లిక్స్ షో)లో నటించిన జ్యోతికపైనేనా? అంటూ గుసగుసలు మొదలయ్యాయి. జ్యోతికపై సిమ్రన్ సైలెంట్ గా సెటైర్ వేసిందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి జ్యోతిక స్పందిస్తుందా లేదా చూడాలి. ఇక కెరీర్ పరంగా జ్యోతిక, సిమ్రన్ చాలా కాలం పాటు ఒకరితో ఒకరు పోటీపడిన సంగతి తెలిసిందే. వారి మధ్య వృత్తిపరమైన కాంపిటీషన్ అప్పట్లో ఉండేది.