మినీ ఫ్రాక్ లో పిచ్చెక్కిస్తున్న సిమ్రాన్ చౌదరి.. ఆ ఫోజులేంటి సామీ!
స్కై బ్లూ అండ్ వైట్ మినీ స్కర్ట్ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. పైగా ఉల్లి పొరలాంటి వైట్ కలర్ షర్ట్ ధరించి పలు రకాల ఫోజులతో యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
By: Madhu Reddy | 10 Feb 2026 10:24 PM ISTఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు అభిమానులను అలరించడానికి నిత్యం పరితపిస్తున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు దర్శనమిచ్చే ఈ అమ్మాయిలు.. తమ అందాలతో యువతను విపరీతంగా అలరిస్తున్నారు అనడంలో సందేహం లేదు. నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే ఈ హీరోయిన్స్ అభిమానులను ఎప్పటికప్పుడు అలరించడానికి భిన్న విభిన్నమైన వస్త్రధారణలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఫోటోషూట్ అంటూ ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాలను కూడా ఎంపిక చేసుకొని తమ అందాలతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంటున్నారు.
అందులో భాగంగానే ప్రముఖ యంగ్ బ్యూటీ సిమ్రాన్ చౌదరి కూడా తన అందాలతో ఆకట్టుకోవడానికి మరోసారి అభిమానుల ముందుకు వచ్చేసింది. అయితే ఈసారి తన ఫోటోషూట్ ను టెన్నిస్ కోర్టు నుంచి షేర్ చేసుకోవడం గమనార్హం. స్కై బ్లూ అండ్ వైట్ మినీ స్కర్ట్ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. పైగా ఉల్లి పొరలాంటి వైట్ కలర్ షర్ట్ ధరించి పలు రకాల ఫోజులతో యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా సిమ్రాన్ చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అమ్మడి అందానికి ముగ్ధులవుతున్నారు. విశ్వక్ సేన్ పాగల్, అథర్వ వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సిమ్రాన్ చౌదరి ఈ ఏడాది 'వనవీర' సినిమాతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. 2026 జనవరి 1న విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి అవినాష్ తిరువీధుల దర్శకత్వం వహించారు. నందు విజయ్ కృష్ణ తో కలిసి నటించారు. పౌరాణిక ప్రేరేపిత యాక్షన్ చిత్రమే కానీ అంచనాలు పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్దగా రాణించలేదు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు.
మరోవైపు టీవీ సిరీస్ 'మిషన్ తఫాసీ' లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'ఈ నగరానికి ఏమైంది?' సీక్వెల్ లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది రిపీట్ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. కాలేజ్ ఫ్రెండ్షిప్, ఫన్, కలలు వంటి అంశాలను మిళితం చేస్తూ చాలా సహజంగా చూపించిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది .
ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా ఈ నగరానికి ఏమైంది రిపీట్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. మొత్తానికైతే సిమ్రాన్ చౌదరి ఇలా ఒకవైపు వరుస సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే.. మరొకవైపు అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
